శ్రీకాంత్ బాబు మైథిలుక్ థీమ్ ఆర్ట్ ఎగ్జిబిషన్‌కు విశేష స్పందన

ABN , First Publish Date - 2022-09-26T05:04:03+05:30 IST

కళాత్మక హృదయాలు కలిగిన చిత్రకారులు తమ ఆలోచనలకు ఒక రూపం తీసుకొచ్చి చిత్రాన్ని గిస్తే అది ఒక అద్భుతమే

శ్రీకాంత్ బాబు మైథిలుక్ థీమ్ ఆర్ట్ ఎగ్జిబిషన్‌కు విశేష స్పందన

హైదరాబాద్‌ సిటీ/మాదాపూర్: కళాత్మక హృదయాలు కలిగిన చిత్రకారులు తమ ఆలోచనలకు ఒక రూపం తీసుకొచ్చి చిత్రాన్ని గిస్తే అది ఒక అద్భుతమే అవుతుంది. జంట నగరాలకు చెందిన ప్రముఖ చిత్రకారుల చేతిలో నిర్మితమైన కళాకృతుల  ప్రదర్శన మాదాపూర్‌లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీ‌లో  కొలువుదీరింది. కళలను, కళాకారులను ఎప్పుడూ సపోర్ట్ చేయడానికి ముందుండే అలేఖ్య హోమ్స్ ఆధ్వర్వంలో ఈ  ఎగ్జిబిషన్ ఏర్పాటైంది. ఈ కళాకృతుల ఎగ్జిబిషన్‌ను ప్రముఖ ఇండియన్ మ్యూజిక్ కంపోజర్ ఆర్. పి.పట్నాయక్, అలేఖ్య హోమ్స్ నిర్వాహకులు శ్రీనాధ్ కుర్ర మరియు డాక్టర్ గౌతమ్ (జాయింట్ డైరెక్టర్ ESI తెలంగాణ) కలిసి ఆదివారం ప్రారంభించారు.


ప్రముఖ చిత్రకారులు, ది వరల్డ్ రికార్డ్ హోల్డర్ శ్రీకాంత్ బాబు అడెపు.. కుంచెతో వేసిన 12,000 రకాలైన ఆకృతులు.. అలాగే మైథిలోజి మరియు క్యూబిజం ఆర్టిస్ట్ థీమ్‌తో వేసిన చిత్రాలు ఈ ప్రదర్శనలో కొలువుదీరి చూపరులను కట్టిపడేస్తున్నాయి. అనంత పద్మనాభ పెయింటింగ్, విష్ణు మూర్తి, బ్రహ్మ, శివుడు మరియు వినాయక.. అలాగే గ్రామీణ వాతావరణంలోని సహజశైలి, దశావతరం, స్త్రీల సహజ సిద్ధమైన అందాలు, చారిత్రక శిల్ప కళ, వివిధ రకాల చిత్రాలు విభిన్న అంశాలతో కూడిన పలు చిత్రాలు కళ్లకు కట్టినట్లుగా ప్రేక్షకులకు చూపించారు. ఈ ఎగ్జిబిషన్ ఆదివారం నుంచి ఈ నెల 30వ తేదీ వరకు కొనసాగుతున్నట్లు నిర్వహకుడు శ్రీకాంత్ బాబు తెలిపారు.

Updated Date - 2022-09-26T05:04:03+05:30 IST