ఆదర్శనీయుడు గౌతు లచ్చన్న

ABN , First Publish Date - 2022-08-17T06:49:56+05:30 IST

ఆదర్శనీయుడు గౌతు లచ్చన్న

ఆదర్శనీయుడు గౌతు లచ్చన్న
గన్నవరంలో గౌతు లచ్చన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, టీడీపీ నాయకులు

ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు 

గన్నవరం, ఆగస్టు 16 : బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సర్దార్‌ గౌతు లచ్చన్న అని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు అన్నారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో స్వాతంత్య్ర సమరయోధుడు సర్ధార్‌ గౌతు లచ్చన్న జయంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అర్జునుడు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిరం తరం లచ్చన్న శ్రమించారన్నారు. సంఘ సంస్కర్త, రైతు ఉద్యమకారుడిగా పేరొందారని చెప్పారు. ప్రజల కోసం ఎన్నో పోరాటాలు చేశారన్నారు. గౌతు లచ్చన్న నేటి తరానికి ఆదర్శనీయులని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కొండేటి కొండలరావు, వెంకటేశ్వరరావు, చిరుమామిళ్ల సూర్యం, తంగిరాల శ్రీనివాసరావు, ఆళ్ల హనుక్‌, మండవ రమ్యకృష్ణ, బెనర్జీ, అయ్యప్పరెడ్డి, రవీంద్ర, రామకృష్ణ, చంద్రశేఖర్‌, నాగయ్య, సృజన్‌బాబు, శ్రీకాంత్‌, కోనేరు రాము, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 

పెనమలూరు  :  బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ఆనాటి పెత్తందారి భూస్వామ్య వ్యవస్థపై అవిశ్రాంత పోరాటం చేసిన మహనీయుడు సర్దార్‌ గౌతు లచ్చన్న అందరికీ స్ఫూర్తి ప్రదాత అని మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ పేర్కొన్నారు.  పార్టీ కార్యాలయంలో నిర్వహించిన గౌతు లచ్చన్న  జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడా రు. గౌతు లచ్చన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో  టీడీపీ సీనియర్‌ నాయకులు వెలగపూడి శంకరబాబు, దొంతగాని పుల్లేశ్వరరావు, అంగిరేకుల మురళి, కోయ ఆనందప్రసాద్‌, షేక్‌ బుజ్జి, దోనేపూడి రవికిరణ్‌, షేక్‌ సమీర్‌, కొండవీటి శివయ్య, యార్లగడ్డ సుచిత్ర తదితరులు పాల్గొన్నారు.

ఉయ్యూరు  : చిన్న వయస్సులోనే స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని బ్రిటీష్‌ పాలనకు వ్యతిరేకంగా పోరాడి సర్దార్‌ అన్న పేరు గడించిన గౌతు లచ్చన్న అడుగు జాడల్లో నడిచి ఆయన ఆశయ సాదనకు కృషి చేయాలని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వ రరావు, మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్‌ అన్నారు. సర్దార్‌ గౌతు లచ్చన్న సేవా సమితి అధ్యక్షుడు కాగిత కొండ ఆధ్వర్యంలో హబ్‌ ఫంక్షన్‌ హాల్‌లో మంగళవారం నిర్వహించిన గౌతు లచ్చన్న జయంతి కార్యక్రమంలో వడ్డే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా లచ్చన్న చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.  కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పంతగాని రమేష్‌ మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి లచ్చన్న చేసిన సేవలు ఎనలేనివన్నారు. లచ్ఛన్న సేవాసమితి ద్వారా కొండ చేస్తున్న  కార్యక్ర మాలను  ఉయ్యూరు మాజీ చైర్మన్‌ జంపాన పూర్ణచంద్రరావు అభినందించి భవిష్యత్‌లో చేపట్టే కార్యక్రమాలకు సహాయ సహకారాలుం టాయని ప్రకటించారు. 16వ వార్డు కౌన్సిలర్‌ జంపాన పూర్ణిమ, బీఎస్పీ నాయకుడు రవీంద్ర, టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు కుటుంబరావు, పరిమి భాస్కర్‌, నాగకుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

ఫ టీడీపీ బీసీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి రాజులపాటి ఫణికుమార్‌  ఆధ్వర్యం లో వైవీబీ కార్యాలయంలో జరిగిన లచ్చన్న జయంతి కార్యక్రమంలో వైవీబీ రాజేంద్రప్రసాద్‌ పాల్గొని లచ్చన్న చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అజ్మతుల్లా, అప్పలనాయుడు, శివ, నరసింహారావు  తదితరులు పాల్గొని లచ్చన్నకు నివాళులర్పించారు.  

Updated Date - 2022-08-17T06:49:56+05:30 IST