కార్యక్రమంలో మాట్లాడుతున్న కలెక్టర్ నివాస్, పక్కన పార్థసారథి
పెనమలూరు, మార్చి 26 : విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా అధునాతనంగా వసతి గృహాలను తీర్చిద్దినట్టు కలెక్టర్ జె.నివాస్ అన్నారు. మార్పు కార్యక్రమంలో భాగంగా పెనమలూరు ఎస్సీ బాలికల వసతిగృహాన్ని సుమారు రూ. 17.50 లక్షలతో తీర్చిది ద్దారు. శనివారం వసతిగృహం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిం చారు. ముఖ్య అతిథులుగా కలెక్టర్ నివాస్, ఎమ్మెల్యే పార్థసారథి విచ్చే సి ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులకు అన్ని విధాల సౌకర్యవంతంగా ఉండేలా వసతి గృహాన్ని తీర్చిదిద్దామన్నారు. ఎమ్మెల్యే సారథి మాట్లాడు తూ, జిల్లాలో 125 వసతి గృహాల్లో మార్పు కార్యక్రమం ద్వారా ఆధునిక వసతులు కల్పించాలనే ఆలోచన మంచి నిర్ణయ మన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు లింగాల భాస్కరరావు, కాకర్ల వెంకటరత్నం, తాడిగడప మున్సిపల్ కమిషనర్ ఎన్ ప్రకాశరావు, తదితర అధికారులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.
సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి
పాయకాపురం : గిరిజన సంక్షేమాభివృద్ధి పథకాలను ప్రతి గిరిజన కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ జె.నివాస్ చెప్పారు. పమిడిముక్కల మండలం గురజాడ యానాది కాలనీలో యానాది, గిరిజనులకు శనివారం సైకిళ్లు, గృహనిర్మాణాలకు ఆర్ధిక సహాయం, రేషన్, ఆధార్ కార్డులు, కులధ్రువీకరణ పత్రాలు, ఆరోగ్యశ్రీ కార్డులతో పాటు 10 కేజీల బియ్యం పంపిణీ కార్యక్రమం శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన నివాస్ మాట్లాడుతూ.. ప్రభుత్వం గిరిజనులకు అందిస్తున్న ఆర్ధిక సహాయం, పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తమ పిల్లలను పాఠశాలకు పంపాలని కోరారు. ఈ సందర్భంగా 40 సైకిళ్లు పంపిణీ చేశారు. యానాదుల గృహ నిర్మాణాలకు ప్రత్యేకంగా సర్ధుబాటు సహాయంగా 38 మంది లబ్ధిదారులకు రూ. 23.94 లక్షలు మంజూరు చేసినట్టు తెలిపారు. గిరిజన సంక్షేమానికి ట్రైబల్ సబ్‌ప్లాన్‌లో గిరిజన గ్రామాల్లో రహదారులు, సీసీరోడ్లు మౌలిక వసతులు కల్పిస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమశాఖ అధికారి రుక్మాంగదయ్య, తహసీల్దార్ కె. వెంకట శివయ్య, ఎంపీడీవో నాంచారరావు, తదితరులు పాల్గొన్నారు.