హైద‌రాబాద్‌కు ‘ఆది పురుష్’..!

May 7 2021 @ 13:20PM

ప్ర‌భాస్ న‌టిస్తోన్న పాన్ ఇండియా సినిమాల్లో ‘ఆది పురుష్‌’  ఒక‌టి. ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ ముంబై నుంచి హైదరాబాద్‌కు మారిందని టాక్. వివరాల్లోకి వెళితే..ఈ సినిమా షూటింగ్‌ను మార్చి నెల‌లో ముంబైలోని ఓ ప్రైవేటు స్టూడియోలో ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. కొంత భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త‌దుప‌రి షెడ్యూల్‌ను కొన్ని వారాల ముందుటే ముంబై స్టూడియోలో ప్రారంభించాల్సి ఉంది. అయితే ప్ర‌స్తుతం దేశంలో కొన‌సాగుతోన్న సెకండ్ వేవ్ ప‌రిస్థితులు కార‌ణంగా క‌రోనా కేసులు మ‌హారాష్ట్ర‌లో ఎక్కువ‌గా న‌మోదవుతున్నాయి. దీంతో ప్ర‌భుత్వం క‌ఠిన నియ‌మ నిబంధ‌న‌ల‌ను విధించింది. ఈ కార‌ణంగా ‘ఆది పురుష్‌’  షూటింగ్‌ను మ‌హారాష్ట్ర‌లో కొన‌సాగించ‌డం క‌ష్ట‌మ‌ని మేక‌ర్స్ భావించార‌ట‌. అందువ‌ల్ల కాస్త ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డ‌గానే ‘ఆది పురుష్‌’ కొత్త షెడ్యూల్‌ను హైద‌రాబాద్‌లోనే చిత్రీక‌రించాల‌నుకుంటున్నట్లు వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. మ‌రి ఈ వార్త‌ల్లో నిజానిజాలేంటో తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే. ప్ర‌భాస్‌తో పాటు సైఫ్ అలీఖాన్‌, కృతిస‌న‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తోన్న్ సంగ‌తి విదిత‌మే. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.