పీవీ నరసింహారావు హయాంలో అకాడమీ ప్రారంభమైంది: Adimulapu suresh

ABN , First Publish Date - 2021-07-15T00:07:08+05:30 IST

పీవీ నరసింహారావు హయాంలో అకాడమీ ప్రారంభమైంది: Adimulapu suresh

పీవీ నరసింహారావు హయాంలో అకాడమీ ప్రారంభమైంది: Adimulapu suresh

అమరావతి: తెలుగు అకాడమీని తెలుగు సంస్కృత అకాడమీగా మార్చుతూ జీవో 31ని విడుదల చేశామని మంత్రి  ఆదిములపు సురేష్ తెలిపారు. జీవో పై క్యాబినెట్‌లో చర్చ జరిగిందన్నారు. అలాగే తెలుగు భాషాభివృద్ధి పరిధిని పెంచాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. మాతృభాషపై పరిశోధన, అభివృద్ధి చేయాలనే సంస్కృతి భాషను కూడా జోడించినట్లు తెలిపారు. భారతీయ భాషలకు మూలం సంస్కృతమన్నారు. 


జీవోను కొన్ని పార్టీల నేతలు వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. తెలుగు భాష పై ముసలి కన్నీరు కారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు అకాడమీ టీడీపీ స్థాపించిన అకాడమీ అని చంద్రబాబు మాట్లాడటం విడ్డురంగా ఉందన్నారు. 1968 లో తెలుగు అకాడమీ ప్రారంభమైందని తెలిపారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు హయాంలో అకాడమీ ప్రారంభమైందని గుర్తుచేశారు. చంద్రబాబు హయాంలో తెలుగు అకాడమీ అస్థిరత కోల్పోయిందన్నారు. మాతృభాషను కాపాడుతూ ఇంగ్లీష్ బోధనను ప్రవేశపెట్టామని పేర్కొన్నారు.  40లక్షల మంది విద్యార్థులకు తెలుగు నిఘంటికను పంపిణీ చేశామన్నారు.

Updated Date - 2021-07-15T00:07:08+05:30 IST