ltrScrptTheme3

'ఆదిపురుష్': ఫైనల్ షెడ్యూల్‌లో ప్రభాస్..!

Oct 26 2021 @ 11:32AM

ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ 'ఆదిపురుష్'. ఈ మూవీ చివరి షెడ్యూలు షూటింగ్ తాజాగా మొదలైంది. ఈ షెడ్యూల్‌లో ప్రభాస్ పాల్గొంటున్నారు. ఇందులో కృతి సనన్ హీరోయిన్‌గా, సైఫ్ అలీఖాన్, సన్నీ సింగ్ ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇప్పటికే కృతి సనన్, సైఫ్ అలీఖాన్ తమ పాత్రలకి సంబంధించిన షూటింగ్‌ను పూర్తి చేశారు. ఈ షెడ్యూల్‌తో ప్రభాస్ కూడా తన పార్ట్ షూట్ కంప్లీట్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాతో పాటే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'సలార్', నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'ప్రాజెక్ట్ k', సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో 'స్పిరిట్' చిత్రాలను చేయనున్నాడు. ఇక యంగ్ డైరెక్టర్ రాధాకృష్ణ దర్శకత్వంలో చేసిన 'రాధే శ్యామ్' వచ్చే ఏడాది సంక్రాంతికి 7 భాషలలో రిలీజ్ కానుంది. పూజా హెగ్డే ఇందులో హీరోయిన్. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.