బైక్‌ చేజింగ్‌ శిక్షణలో అదితి

Jun 14 2021 @ 12:49PM

తమిళ చిత్రపరిశ్రమలోకి ‘పట్టాదారి’ అనే చిత్రం ద్వారా అడుగుపెట్టిన భామ అదితి మీనన్‌. కేరళకు చెందిన ఈమె నటించిన చిత్రాలు అతి తక్కువే అయినప్పటికీ... వివాదాలు మాత్రం అనేకం ఉన్నాయి. ‘నెడునల్‌వాడై’ అనే చిత్రం దర్శకుడిపై లైంగిక వేఽధింపుల ఆరోపణలు చేసింది. ఈ వివాదం సద్దుమణగక ముందే తాను ప్రేమించి పెళ్ళి చేసుకున్న భర్త అభి శరవణన్‌పై కూడా ఇదే తరహాలో ఆరోపణలు చేసింది. ఈ వివాదాలు ఇలావుండగానే మలయాళంలో సీనియర్‌ హీరో మోహన్‌లాల్‌ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘బిగ్‌ బ్రదర్‌’తో నటించి ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచింది. ఇపుడు ఈమె తన పేరును మార్చుకుంది. అదితి మేనన్‌ పేరు కాస్త మిర్ణాగా మారింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆమె తమిళంలో ఓ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ చిత్రంలో నటిస్తోంది. అదేవిధంగా మలయాళంలో కూడా మరో చిత్రంలో నటించేందుకు కమిట్‌ అయింది. అయితే, ఈ చిత్రంలో బైక్‌ ఛేజింగ్‌లు కత్తిఫైట్లు వున్నాయి. దీంతో ఆమె బైక్‌ ఛేజింగ్‌, కలరిపట్టు శిక్షణను తీసుకుంటోంది. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.