ఆదిత్యా చోప్రా వ్యాక్సిన్‌ డ్రైవ్‌

Jun 9 2021 @ 00:51AM

ప్రభుత్వం  ప్రత్యేక అనుమతుల నేపథ్యంలో సినిమా చిత్రీకరణలకు బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమ సన్నద్ధమవుతోంది. సినీ కార్మికులకు తొలి డోసు కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ప్రారంభమైంది. మంగళవారం ముంబైలోని యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ స్టూడియోలో నిర్మాత ఆదిత్యాచోప్రా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పశ్చిమ భారత సినీ కార్మిక సమాఖ్యలో మొత్తం 2.50 లక్షల మంది కార్మికులు ఉండగా మొదటి దశలో 4 వేల మందికి వ్యాక్సిన్‌ ఇవ్వనున్నారు. ఇప్పటికే యశ్‌ రాజ్‌ సంస్థ తమ ప్రొడక్షన్‌ కంపెనీకి చెందిన ఉద్యోగులకూ, తాము నిర్మిస్తున్న పలు చిత్రాల యూనిట్‌ సిబ్బందికి వ్యాక్సిన్‌ ఇవ్వడం పూర్తయింది.


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.