
ముంబై: పెట్రోల్, గ్యాస్ ధరల పెరుగుదలను ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వంపై మహారాష్ట్ర మంత్రి, శివసేన నేత ఆదిత్య థాకరే విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ ఎన్నికలు అయిపోయాయని అందుకే ధరలు పెరుగుతున్నాయని, ధరలు తగ్గాలంటే మళ్లీ ఎన్నికలు మళ్లీ రావాలని ఆయన విరుచుకుపడ్డారు. మహారాష్ట్రలో కొవిడ్-19 కేసులు పెరుగుతున్న తరుణంలో బుధవారం రాష్ట్రంలోని ఓ ఆసుపత్రికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘‘బీజేపీ ప్రజల కోసం ఏమీ చేయదు. ఏది చేసినా ఎన్నికల కోసమే. యూపీ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయని ధరలు పెంచలేదు. అదే ఎన్నికలు అయిపోయిన మరునాటి నుంచే ఆకాశన్ని అంటుతున్నాయి. మళ్లీ ధరలు తగ్గొచ్చు. లేదా కనీసం పెరగకుండా అయినా ఉండొచ్చు. అలా జరగాలంటే మళ్లీ ఎన్నికలు రావాలి’’ అని అన్నారు. ఇక కొవిడ్-19 పరిస్థితిపై స్పందిస్తూ ప్రస్తుతం రాష్ట్రంలో కొవిడ్-19 క్రమంగా పెరుగుతున్నాయని, తొందరలోనే తగ్గుముఖం పడతాయని ఆదిత్య అన్నారు.
ఇవి కూడా చదవండి