ఆదివాసీలు ఐక్యంగా ఉండాలి

ABN , First Publish Date - 2022-08-10T04:20:06+05:30 IST

ఆదివాసీ ఐక్యంగా ఉండి అభివృద్ధి చెందాలని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆదివాసీ భవనంలో ఎమ్మెల్యే ఆత్రం సక్కు అధ్యక్షతన నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలకుజిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ కోవ లక్ష్మి, కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఆదివాసీలు ఐక్యంగా ఉండాలి
ఆసిఫాబాద్‌లో కుమరం భీం చిత్రపటానికి పూల మాల వేస్తున్న కలెక్టర్‌, జడ్పీ చైర్‌పర్సన్‌, ఎమ్మెల్యే

- జిల్లా కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌

ఆసిఫాబాద్‌, ఆగస్టు 9: ఆదివాసీ ఐక్యంగా ఉండి అభివృద్ధి చెందాలని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆదివాసీ భవనంలో ఎమ్మెల్యే ఆత్రం సక్కు అధ్యక్షతన నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలకుజిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ కోవ లక్ష్మి, కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో ఉన్న ఆదివాసీ భవనం 9 తెగలకు సంబంధించిందని చెప్పారు. అందరు వినియోగించుకోవచ్చని అన్నారు.  జడ్పీ చైర్‌పర్సన్‌ కోవ లక్ష్మి మాట్లాడుతూ జిల్లాలోని ఆదివాసీ విద్యార్థులు విద్యలో అభివృద్ధి చెంది ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నారు.  ఎమ్మెల్య ఆత్రం సక్కు మాట్లాడుతూ ఆదివా సీలు అభివృద్ధి జరగాలంటే వలస వాదులకు పథకాలు రాకుండా చూడాలన్నారు. అదనపు కలెక్టర్‌ చాహత్‌ వాజ్‌పేయ్‌ మాట్లాడుతూ  ప్రతి ఒక్కరూ కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకోవాలన్నారు.  కార్యక్రమంలో జడ్పీటీసీ చంద్రశేఖర్‌, ఎంపీపీలు మల్లికార్జున్‌, మోతిరాం, పీఏసీఎస్‌ చైర్మన్‌ అలీబీన్‌ అహ్మద్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మల్లేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

కాగజ్‌నగర్‌: కుమరం భీం ఆశయాల సాధనకు పాటుపడాలని వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ సిర్పూరు నియోజకవర్గ తాలుకా ఇన్‌చార్జ్జి పెద్ద్దపల్లి కిషన్‌ రావు పెద్దపల్లి కిషన్‌రావు అన్నారు. మంగళవారం ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని పురస్కరించుకొని డాడానగర్‌ చౌరస్తా వద్ద ఉన్న కుమరం భీం విగ్రహానికి పూల మాల వేశారు.  కాగజ్‌నగర్‌ రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో  భీం విగ్రహానికి పూల మాలలు వేశారు.  కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు ఎఎస్‌ఆర్‌ మూర్తి, కార్యదర్శి ఎం.శివప్రసాద్‌, బి.నర్సయ్య, అల్లి రాజయ్య, రాధాకిషన్‌, రామయ్య, తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో  ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని  నిర్వహంచారు. కార్యక్రమాల్లో ఈ  టీఏజీఎస్‌ జిల్లా ఉపాధ్యక్షుడు కోట శ్రీనివాస్‌ , నాయకులు దేవ్‌రావు, మాడావి రాకేష్‌, రమేష్‌, భీంరావు, అంజి, నితిష్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు భీమేష్‌, జిల్లా ఉపాధ్యక్షులు చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

సిర్పూర్‌(యూ): మండలంలోని ఆయా గ్రామాల్లో ఆదివాసీలు తమ జెండాను ఆవిష్కరించారు. మండల కేంద్రంలోని గాంధీచౌక్‌లో గల కుమరం భీం విగ్రహానికి ప్రత్యేక పూజలు చేసి నివాళులర్పించారు. కార్యక్ర మంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఆత్రం భగవంత్‌రావు, సర్పంచులు మెస్రం భూపతి, ఆర్క హిరాబాయి నాగోరావు, పెందోర్‌ నాగోరావు, ఆత్రం వీనా బాయి, వైస్‌ ఎంపీపీ ఆత్రం ప్రకాష్‌, గోండి ధర్మ కోయపున్నే రాష్ట్ర ఉపాఽధ్యక్షుడు ఆత్రం ఆనంద్‌రావు, ఆదివాసీ విద్యార్థి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కుడ్మేత విశ్వనాథ్‌ రావు, తోడసం ధర్మరావు, పీఏసీ చైర్మన్‌ కేంద్రే శివాజీ పాల్గొన్నారు.  

జైనూర్‌: భారత రాజ్యంగా కల్పించిన హక్కుల సాధన కోసం పోరటాలు చేయాలని ఆదివాసీ సంఘాలు పిలుపునిచ్చాయి. మంగళవారం మండల కేంద్రంలోని మార్కెట్‌ యార్డు ఆవరణలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలో భారీ రాలీ నిర్వహించారు. మండల కేంద్రంలో గల కుంరం భీం విగ్రహానికి ఆదివాసీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయా కార్యక్రమాల్లో జిల్లా గ్రంఽథాలయ సంస్థ చైర్మన్‌ కనక యదవ్‌రావు, జైనూర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఆత్రం భగవంత్‌రావు, కుంరం భీం మనవడు కుంరం సోనేరావు, ఎంపీపీ కుమ్ర తిరుమల విశ్వనాథ్‌,తుండు దెబ్బ రాష్ట్ర ఉపాధ్యకుడు మెస్రం మోతిరాం, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆత్రం శంకర్‌, ఆదివాసీ సంక్షేమ పరిషత్‌ జిల్లా గౌరవ అధ్యక్షులు మెస్రం శేకు, తుడుం దెబ్బ మండల అధ్యక్షుడు ఆడ అమృత్‌ రావు, ప్రదాన కార్యదర్శి కనక గంగారాం, మహిళా విభాగం జిల్లా అధ్యక్షరాలు గోండ జంగుబాయి తదితరులు పాల్గొన్నారు.     

చింతలమానేపల్లి: మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించి బస్టాండు సమీపంలో కుమరం భీం చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జెండాను ఆవిష్కరించారు. ఎంపీడీవో కార్యాలయంలో కుమరం భీం చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఎంపీపీ నానయ్య, ఆదివాసీ నాయకులు పాల్గొన్నారు. 

లింగాపూర్‌: మండలంలో ఆదివాసీ నాయకులు కుమరం భీం చిత్రపటాలకు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జెండాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో నాయకులు బాదిపటేల్‌, మనుకుపటేల్‌, అనీల్‌, ణపతి, ప్రకాష్‌, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. 

పెంచికలపేట: మండలంలోని ఆయా గ్రామాల్లో కుమరం భీం విగ్రహాలు, చిత్రపటాలకు పూల మాలలు వేసి నివాళులు అర్పించి జెండాలను ఆవిష్కరించారు.  కార్యక్రమంలో సకారం, అశోక్‌, భుజంగరావు, శంకర్‌, ముత్తయ్య, శంకర్‌, రాజన్న, పోచన్న తదితరులు పాల్గొన్నారు. 

బెజ్జూరు: మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించి కుమరం భీం విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.  కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు సకారాం, చిన్నయ్య, మహేష్‌, వెంకటేష్‌, భిక్షమయ్య, సర్పం చ్‌ హన్మంతు, రవి, తిరుపతి, ఎంపీటీసీలు సాయి, కార్యదర్శులు రాములు, తుకారాం, రాజారాం, సత్తయ్య, శంకర్‌, మల్లేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

తిర్యాణి: మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో  కుమరం భీం విగ్రహానికి పూల మాలలు వేసి జెండాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు సింధుజ, రుక్మిణి, సుజాత, నాయకులు ప్రవీణ్‌, భగవంతరావు, శ్రీరాములు, జనార్ధన్‌, రవీందర్‌, సుభాష్‌, వెంకటేష్‌, శ్రీధర్‌, చిరంజీవి, తిరుపతి, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. 

దహెగాం:  మండల కేంద్రంతో పాటు దిగిడ, లోహ, చంద్రపల్లి తదితర గ్రామాల్లో కుమరం భీం చిత్రపటాలకు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జెండాలను ఎగురవేశారు.  కార్యక్రమంలో నాయకులు బక్కయ్య, అశోక్‌, కిష్టయ్య, సాంబయ్య, బాపు, రజిత, దామోదర్‌, సంతోష్‌, గురవమ్మ, కమల తదితరులు పాల్గొన్నారు. 

కౌటాల: మండల కేంద్రంలో ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ర్యాలీ నిర్వహించి కుమరం భీం విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో డీసీఎంఎస్‌ వైస్‌ చైర్మన్‌ మాంతయ్య, సీఐ బుద్దేస్వామి, ఎస్సై మనోహర్‌, నాయకులు పోశం, బ్రహ్మయ్య, సదాశివ్‌, సత్యనారాయణ, గంగారాం, హన్మంతు, పోచాని, తిరుపతి, సాయినాథ్‌, అశోక్‌, సర్పంచ్‌లు, తదితరులు పాల్గొన్నారు. 

వాంకిడి : ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని మండల కేంద్రంలో ఆదివాసీలు స్థానిక కుమరం భీం చౌక్‌ నుంచి మార్కెట్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.  ఆయా కార్యక్రమాల్లో తుడుం దెబ్బ జిల్లా అద్యక్షుడు కోట్నక విజయ్‌కుమార్‌, తహసీల్దార్‌ మధుకర్‌, ఎస్సై డీకొండ రమేష్‌  రాయిసెంటర్‌ మండల అధ్యక్షుడు సోయం భీంరావు, తుడుం దెబ్బ మండల అధ్యక్షుడు రాంశావ్‌, కోలాం సంఘం జిల్లా కార్యదర్శి సీడాం అన్నిగ,  ఆదివాసి సర్పంచులు అడా జైరాం, దేవరావు,  నాయకులు పాల్గొన్నారు.  

కెరమెరి: ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని జోడేఘాట్‌లోని భీం విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అలాగే మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు.  కార్యక్రమంలో ఎంపీపీ మోతిరాం, కోవ విజయ్‌, ఇందిర, లక్ష్మణ్‌, బొజ్జిరావు, రఘునాథ్‌ తదితరులు ఉన్నారు. 

రెబ్బెన: మండలంలోని గోలోటిలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని సింగరేణి ఎస్టీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ సభ్యులు  ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో తిరుమలరావు, శ్రీ రాములు, కృష్ణా, నరేష్‌ కోటేశ్వర్‌ రావు, వీరాలాల్‌, వరలక్ష్మి సౌందర్య, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-10T04:20:06+05:30 IST