మదమెక్కిన పిచ్చికుక్క కొడాలి నాని

ABN , First Publish Date - 2022-03-17T08:29:49+05:30 IST

మదమెక్కిన పిచ్చికుక్క కొడాలి నాని

మదమెక్కిన పిచ్చికుక్క కొడాలి నాని

కుక్కకు ఉన్న విశ్వాసం కూడా లేదు

చంద్రబాబు ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వకపోతే బస్టాండ్‌లో గుట్కాలు అమ్ముకునే వాడివి..

పది రోజుల్లో నీ అవినీతి చరిత్ర బయటపెడతా

కొడాలి నానిపై బుద్దా వెంకన్న ఫైర్‌


విజయవాడ (వన్‌టౌన్‌), మార్చి 16: మదమెక్కిన పిచ్చికుక్క కొడాలి నాని అసెంబ్లీలో చంద్రబాబుపై పిచ్చి వాగుడు వాగుతున్నాడని మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ ఉత్తరాంధ్ర ఇన్‌చార్జి బుద్దా వెంకన్న తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విజయవాడలోని తన కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జంగారెడ్డిగూడెంలో కల్తీసారా తాగి చనిపోయిన వ్యక్తుల కుటుంబాలను పరామర్శించేందుకు చంద్రబాబు తన బాధ్యతగా వెళ్లారన్నారు. కానీ.. మదమెక్కిన మంత్రి కొడాలి నాని సిగ్గులేకుండా చంద్రబాబు చేసే సాయాన్ని కూడా అసెంబ్లీలో తప్పుబట్టడం హేయమన్నారు. అంతమంది చనిపోతే నైతికంగా ప్రభుత్వమే సహాయం చేయాలన్నారు. కొడాలి ఆనాడు రామోజీరావు, రాధాకృష్ణల బూట్లు నాకాడని, చంద్రబాబు బి-ఫారం ఇస్తే పోటీ చేశాడని గుర్తుచేశారు. ఆయనకు బి-ఫారం ఇవ్వడమే చంద్రబాబు చేసిన తప్పన్నారు. కుక్కకు ఉన్న విశ్వాసం కూడా కొడాలికి లేదన్నారు. చంద్రబాబు ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వకపోతే బస్టాండ్‌, రైల్వే స్టేషన్లలో గుట్కా ప్యాకెట్లు అమ్ముకునేవాడన్నారు. ఒకప్పుడు గుట్కాకు కూడా డబ్బులు అడుక్కునే వాడు.. ఈ రోజున వేల కోట్లు సంపాదించాడని విమర్శించారు. నోరేసుకుని ఒకరిని దుర్భాషలాడితే సీఎం జగన్‌.. మంత్రి పదవిలో ఉంచుతాడని నాని భ్రమపడుతున్నాడన్నారు. ‘చంద్రబాబు అంతు చూసే దమ్ముందా.. ఎవడ్రా నువ్వు..? లోకేశ్‌, అచ్చెన్నాయుడులను తిడతావా..? కమ్మ సామాజిక వర్గానికి చెందిన నలుగురైదుగురిని తిడుతుంటే జగన్‌ వద్ద పేరు వస్తుందనుకుంటున్నావా? నోటికొచ్చినట్టు మాట్లాడితే ఇక నోరెత్తకుండా బుద్ది చెబుతాం’’ అని హెచ్చరించారు. చంద్రబాబు ప్యాకేజీలు ఇవ్వరు.. పవన్‌కళ్యాణ్‌ తీసుకోడు అన్నారు. చంద్రబాబు వద్ద అంత డబ్బు లేదన్నారు. నాని 840 గాడని, డేరాబాబా తరహాలో తీహార్‌ జైలుకు వెళతాడని అన్నారు. పదిరోజుల్లో కొడాలి అవినీతి చరిత్ర బయట పెడతానని హెచ్చరించారు. కొడాలి నానీని ఆయన పుట్టిన జాతిలోని వారే అసహ్యించుకుంటున్నాని అన్నారు. తాను బీసీనని.. కొట్టుకుందాం అంటే సై అని సవాల్‌ విసిరాడు. పార్టీ పొత్తుల అంశం రాష్ట్ర నాయకత్వం చూసుకుంటుందని బుద్దా చెప్పారు. చంద్రబాబు పొత్తులు ప్రకటించకముందే వీరంతా ఎందుకు ఉలిక్కి పడుతున్నారో అర్థం కావ డం లేదన్నారు.

Updated Date - 2022-03-17T08:29:49+05:30 IST