Langerhouse: చెరువులను దత్తత తీసుకుంటా

ABN , First Publish Date - 2022-01-18T15:36:35+05:30 IST

చెరువుల అభివృద్ధికి జీహెచ్‌ఎంసీ నాంది పలికింది. లంగర్‌హౌ్‌సలోని చెరువు సమస్యను స్థానికులు ట్వీటర్‌ ద్వారా మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ దృష్టికి

Langerhouse: చెరువులను దత్తత తీసుకుంటా

లంగర్‌హౌస్‌ చెరువును పరిశీలించిన మేయర్‌  

హైదరాబాద్/లంగర్‌హౌస్‌: చెరువుల అభివృద్ధికి జీహెచ్‌ఎంసీ నాంది పలికింది. లంగర్‌హౌ్‌సలోని చెరువు సమస్యను స్థానికులు ట్వీటర్‌ ద్వారా మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో సమస్యను పరిశీలించాల్సిందిగా, మేయర్‌ విజయలక్ష్మిని మంత్రి ఆదేశించారు. దీంతో మేయర్‌ సోమవారం లంగర్‌హౌస్‌ చెరువును పరిశీలించారు. ఎమ్మెల్యే కౌసర్‌ సమస్యలను వివరించారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే చెరువు ఈ దుస్థితికి చేరిందన్నారు. లక్ష్మీనగర్‌, హరిదా్‌సపుర, ప్రశాంత్‌నగర్‌ ప్రాంతాలకు చెందిన మహిళలు చెరువు వల్ల ఎదురవుతున్న సమస్యలను మేయర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా మేయర్‌ విజయలక్ష్మి లంగర్‌హౌస్‌ చెరువును తాను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. మేయర్‌ వెంట జీహెచ్‌ఎంసీ జోనల్‌ కమిషనర్‌ రవికిరణ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ వడ్డేపల్లి నరసింహ, నానల్‌నగర్‌ కార్పొరేటర్‌ మహ్మద్‌ నసీరుద్దీన్‌, మాజీ కార్పొరేటర్‌ చెరుకుల ఉదయ్‌కుమార్‌, బీజేపీ డివిజన్‌ అధ్యక్షులు గోపిరెడ్డి నాగేంద్ర ప్రకా్‌షరెడ్డి, ఇంద్రసేనారెడ్డి, ఎంఐఎం నాయకులు గోపాల్‌, సునంద పాల్గొన్నారు.

Updated Date - 2022-01-18T15:36:35+05:30 IST