ఎత్తిపోతల పథకానికి శ్రీకారం

ABN , First Publish Date - 2021-06-20T05:51:31+05:30 IST

బసవేశ్వర బోరంచ ఎత్తిపోతల పథకం ద్వారా రేగోడు మండలంలో 15వేల నుంచి 20వేల ఎకరాలకు నీరందుతుందని అందోల్‌ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌ పేర్కొన్నారు.

ఎత్తిపోతల పథకానికి శ్రీకారం
ఎత్తిపోతల పథకానికి స్థలాన్ని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌

20 వేల ఎకరాలకు నీరందించడమే లక్ష్యం

21న హరీశ్‌రావుతో శంకుస్థాపన

అందోల్‌ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌

 రేగోడు జూన్‌ 17: బసవేశ్వర బోరంచ ఎత్తిపోతల పథకం ద్వారా రేగోడు మండలంలో 15వేల నుంచి 20వేల ఎకరాలకు నీరందుతుందని అందోల్‌ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌  పేర్కొన్నారు. ఈ నెల 21న మంత్రి హరీశ్‌రావు ఎత్తిపోతలకు శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో అధికారులతో కలిసి శనివారం ఆయన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎత్తిపోతల పథకంలో భాగంగా బోరంచ నుంచి తాటిపల్లి, దోసపల్లి, పట్టెపొలంతండా, ఆర్‌ ఇటిక్యాల ప్రాంతాలో స్టోరేజీలు ఏర్పాటుచేసి, గొలుసుకట్టు కాల్వల ద్వారా రేగోడు మండలంలోని చెరువులను నింపుతామని వెల్లడించారు. మండల రైతుల సాగునీటి సమస్య శాశ్వతంగా తీరుతుందని పేర్కొన్నారు. బసవేశ్వర బోరంచ ఎత్తిపోతల పథకంతో పాటు సిందోల్‌, టి లింగంపల్లి రోడ్డు పనులకు మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపన చేస్తారని ఆయన వెల్లడించారు. ఆయనవెంట టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు బుచ్చయ్య, ప్రధాన కార్యదర్శి రమేష్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ రాజుయాదవ్‌, రేగోడు సర్పంచ్‌ నర్సింహులు, ఎంపీటీసీ నర్సింహులు, ఏఎంసీ డైరెక్టర్‌ భూంరెడ్డి, నాగయ్యస్వామి, సంతో్‌షరావు తదితరులు ఉన్నారు. రేగోడు ప్రెస్‌క్లబ్‌ నూతన అధ్యక్షుడు శంకర్‌గౌడ్‌, కార్యవర్గ సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు. 

Updated Date - 2021-06-20T05:51:31+05:30 IST