ఇన్‌స్టాగ్రామ్‌ ‘రీల్స్‌’లోనూ యాడ్స్‌

ABN , First Publish Date - 2021-06-19T05:30:00+05:30 IST

‘టిక్‌టాక్‌ ’కు పోటీగా ‘ఇన్‌స్టాగ్రామ్‌’ గత ఏడాది ఆరంభించిన ‘రీల్స్‌’లో ఇకపై వ్యాపార ప్రకటనలు దర్శనమివ్వనున్నాయి. ‘టిక్‌టాక్‌’లో ఉన్నట్టు షార్ట్‌ మ్యూజికల్‌ వీడియోలను ఈ రీల్స్‌లో పెట్టవచ్చు. పదిహేను సెకండ్ల సేపు నిడివి గల రికార్డు చేసిన వీడియోలకు ఇందులో అవకాశం ఉంది.

ఇన్‌స్టాగ్రామ్‌ ‘రీల్స్‌’లోనూ యాడ్స్‌

‘టిక్‌టాక్‌ ’కు పోటీగా ‘ఇన్‌స్టాగ్రామ్‌’ గత ఏడాది ఆరంభించిన ‘రీల్స్‌’లో ఇకపై వ్యాపార ప్రకటనలు దర్శనమివ్వనున్నాయి. ‘టిక్‌టాక్‌’లో ఉన్నట్టు షార్ట్‌ మ్యూజికల్‌ వీడియోలను ఈ రీల్స్‌లో పెట్టవచ్చు. పదిహేను సెకండ్ల సేపు నిడివి గల రికార్డు చేసిన వీడియోలకు ఇందులో అవకాశం ఉంది.   తాజాగా ‘రీల్స్‌’లో ప్రకటనలకు ఇన్‌స్టాగ్రామ్‌ చోటిస్తోంది. రెండు వీడియో క్లిప్పుల మధ్య ముప్పయ్‌ సెకెండ్లు అంటే ఆర నిమిషం సేపు నిడివి ఉన్న ప్రకటనలు కనిపిస్తాయి. అడ్వర్టయిజ్‌మెంట్‌ కంపెనీ పేరుతో ‘స్పాన్సర్డ్‌’ అన్న చిన్న పదాలతో వస్తుంది. ప్రకటనలకు సంబంధించి ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి భారత్‌ సహా ఆస్ట్రేలియా, బ్రెజిల్‌ జర్మనీ దేశాల్లో టెస్టింగ్‌ జరుగుతోంది. వ్యాపార సంస్థలు తమ ఉత్పత్తులను వినియోగదారులకు చేరువ చేసేందుకు ఈ ఏర్పాటు ఉపయోగపడుతుందని ఇన్‌స్టాగ్రామ్‌ భావిస్తోంది.


‘రీల్స్‌’తో ‘ఇన్‌స్టాగ్రామ్‌’లో కొత్త కంటెంట్‌ వినియోగదారులకు అందుబాటులోకి వస్తోందని, అదే ప్రకటనలకు కూడా సహజమైన ఆప్షన్‌గా ఉంటుందని కంపెనీ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ ఒక బ్లాగ్‌లో పేర్కొనడం గమనార్హం. ప్రజలు ఎంటర్‌టైన్‌మెంట్‌ పొందుతున్న చోటే అన్ని బ్రాండ్‌లకు ప్రకటనలు ఇచ్చుకునేందుకు అనువుగా ఉంటుందని కూడా ఆ బ్లాగ్‌లో పేర్కొన్నారు. ‘రీల్స్‌’ వినియోగదారులకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించే యోచనలో ‘ఇన్‌సాగ్రామ్‌’ ఉందని ఆండ్రాయిడ్‌, ఐఔస్‌ డెవలపర్‌ పేర్కొనడం ఈ సందర్భంలో గమనార్హం.  

Updated Date - 2021-06-19T05:30:00+05:30 IST