సంతాన సాఫల్యానికి అధునాతన వైద్యం

ABN , First Publish Date - 2021-11-30T05:07:03+05:30 IST

సంతాన సాఫల్యానికి అధునాతన వైద్యం అందుబాటులోకి తీసుకొచ్చినట్లు విశాఖ ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రి ఫెర్టిలిటీ స్పెషలిస్ట్‌ డాక్టర్‌ సరోజ తెలిపారు.

సంతాన సాఫల్యానికి అధునాతన వైద్యం

రింగురోడ్డు: సంతాన సాఫల్యానికి అధునాతన వైద్యం అందుబాటులోకి తీసుకొచ్చినట్లు విశాఖ ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రి ఫెర్టిలిటీ స్పెషలిస్ట్‌ డాక్టర్‌ సరోజ తెలిపారు. సోమవారం ఎంజీ రోడ్డు సమీపం లోని ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రిలో ఆమె మాట్లాడుతూ.. వయసు అయి పోయిందని, సంతాన ప్రాప్తికి అవకాశం లేదని నిరుత్సాహానికి గురవ్వాల్సిన అవసరం లేదన్నారు.  ఇటువంటి వారి కోసం నూతన వైద్య విధానం అందుబాటులోకి తీసుకొచ్చామని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఆసుపత్రి డైరెక్టర్‌ రమేష్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-11-30T05:07:03+05:30 IST