‘సీతారామం’ ఆగమనం

Published: Sun, 26 Jun 2022 00:55:25 ISTfb-iconwhatsapp-icontwitter-icon

దుల్కర్‌ సల్మాన్‌ కథానాయకుడిగా స్వప్న సినిమా పతాకంపై నిర్మించిన చిత్రం ‘సీతారామం’. హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. మృణాళిని ఠాకూర్‌ కథానాయిక. రష్మిక కీలక పాత్రధారి. అశ్వనీదత్‌ నిర్మాత. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఏకకాలంలో రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 5న విడుదల చేయనున్నారు. ఆదివారం హైదరాబాద్‌లో టీజర్‌ ఆవిష్కరించారు. దుల్కర్‌ మాట్లాడుతూ ‘‘సీతారామం మర్చిపోలేని చిత్రం. ఇదో గొప్ప కథ. అద్భుతమైన లొకేషన్లలో చిత్రీకరణ జరిపాం. విజువల్‌ వండర్‌గా ఈ చిత్రాన్ని నిర్మాతలు తీర్చిదిద్దార’’న్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘వందల మంది రెండేళ్లు పడిన కష్టానికి ప్రతిఫలం.. ‘సీతారామం’. మైనస్‌ 24 డిగ్రీల వద్ద కూడా షూటింగ్‌ చేయాల్సివచ్చింది. దుల్కర్‌, స్వప్నల సహకారం వల్లే ఈ సినిమా సాధ్యమైంద’’న్నారు. స్వప్న మాట్లాడుతూ ‘‘కథ విషయంలో దుల్కర్‌ ఆచితూచి వ్యవహరిస్తారు. మేం కూడా ఈ కథని ఆయనకు పంపేముందు ఒకటికి పదిసార్లు చెక్‌ చేసుకొన్నారు. మా సంస్థపై దుల్కర్‌ పెట్టుకొన్న నమ్మకాన్ని నిజం చేసేలా ఓ అద్భుతమైన చిత్రాన్ని ఆయనకు అందిస్తామ’’న్నారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International