వంద రోజులగా వ్యాన్‌లో నిద్రపోవడం.. పెట్రోల్ బంకుల్లో స్నానం చేయడం.. చిన్నపిల్లాడితో దేశమంతా పర్యటిస్తున్న భార్యభర్తలు..

ABN , First Publish Date - 2022-04-05T09:34:22+05:30 IST

తమిళనాడుకు చెందిన అశోక్, అతని భార్య ప్రభ తమ నాలుగేళ్ల కొడుకుని తీసుకొని వంద రోజులుగా దేశమంతా పర్యటిస్తున్నారు. వారి పర్యటన సాదాసీదాగా.. ఒక వ్యానులో కొనసాగుతోంది. భారతదేశంలోని అన్ని రాష్ట్రాలను వారు ఒక అనుభవం కోసం చేస్తున్నారు. ఈ ప్రయాణంలో వారు ఎన్నో కష్టాలను ఎదర్కొంటూ..

వంద రోజులగా వ్యాన్‌లో నిద్రపోవడం.. పెట్రోల్ బంకుల్లో స్నానం చేయడం..  చిన్నపిల్లాడితో దేశమంతా పర్యటిస్తున్న భార్యభర్తలు..

తమిళనాడుకు చెందిన అశోక్, అతని భార్య ప్రభ తమ నాలుగేళ్ల కొడుకుని తీసుకొని వంద రోజులుగా దేశమంతా పర్యటిస్తున్నారు. వారి పర్యటన సాదాసీదాగా.. ఒక వ్యానులో కొనసాగుతోంది. భారతదేశంలోని అన్ని రాష్ట్రాలను వారు ఒక అనుభవం కోసం చేస్తున్నారు. ఈ ప్రయాణంలో వారు ఎన్నో కష్టాలను ఎదర్కొంటూ.. దేశంలోని భిన్న సంస్కృతులను తెలుసుకుంటున్నారు. ఈ ఆలుమగలు తమ పర్యటనతో దేశానికి ఒక సందేశాన్నిస్తున్నారు. అదేమిటంటే..


తమిళనాడులోని ఒక కంపెనీలో మేనేజర్‌గా పనిచేసే అశోక్ అనే యువకుడికి దేశమంతా పర్యటించాలనే కోరిక ఎప్పటినుంచో ఉండేది. ఆ కోరికని తన భార్యతో చెప్పగా.. ఆమె అతని కోసం తోడుగా బయలుదేరింది. అంతేకాదు.. తన నాలుగేళ్ల కొడుకుని కూడా తోడుగా తీసుకెళ్లింది. 


ప్రయాణం కోసం అశోక్ ముందుగా తన వద్ద ఉన్న మారుతి జెన్ కార్‌లో వెళదామనుకున్నాడు. కానీ అది పాత వాహనం కావడంతో సుదీర్థ ప్రయాణంలో సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువ. అందుకే తన కోరిక తీర్చుకునేందుకు ఒక కొత్త వ్యాన్  కొన్నాడు. ఆ వ్యాన్‌లోనే వంట చేసుకోవడానికి, పడుకోవడానికి వీలుగా అన్ని సదుపాయాలు అమర్చుకున్నాడు. ఆ తరువాత తన తల్లిదండ్రుల అనుమతితో తన భార్య, కొడుకుతో దేశ భ్రమణం కోసం కేవలం రూ.2 లక్షలు తీసుకొని బయలుదేరాడు. ముందుగా వారు కేరళ, కర్ణాటక రాష్ట్రాలను చుట్టేసి ఆ తరువాత ఉత్తర భారతదేశం వైపుకు వెళ్లారు. 


ఈ ప్రయాణంలో వారు రోజూ ఉదయాన్నే లేచి 200 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఆ తరువాత టిఫిన్ చేస్తారు. ఆ తరువాత మళ్లీ బయలుదేరి మధ్యాహ్నం భోజనం తయారు చేసుకునేందుకు ఆగుతారు. ఇలా ఇప్పటికే 15,000 కిలో మీటర్లు ప్రయాణించారు. అశోక్ భార్య తమ ప్రయాణం గురించి మాట్లాడుతూ.. "ఈ ప్రయాణంలో చాలా కష్టాలు పడ్డాం. వ్యాన్‌లోనే నిద్రపోవడం. పెట్రోల్ స్టేషన్లలో.. దారిలో ఎక్కడైనా ప్రవహిస్తున నీటితో స్నానం చేయడం వంటివి. కానీ ఆ కష్టాలన్నీ అందమైన లొకేషన్లు చూసే సరికి మర్చిపోయాం. రాజస్థాన్‌లోని థార్ ఎడారిలో రాత్రి గడిపినప్పుడు.. అక్కడ ఎడారిలో పడుకొని ఆకాశంలో తారలు చూస్తూ నిద్రపోయాం. అలాగే కశ్మీర్ వెళ్లినప్పుడు అక్కడ తొలిసారి ఒక అందమైన మంచు ప్రదేశాన్ని చూశాను" అని చెప్పింది.


ఈ భార్యభర్తలిద్దరూ తమ పర్యటనలో భాగంగా విభిన్న సంస్కృతులకు సంబంధించిన మనుషులను కలిశారు. అక్కడి ఆచారాలను గమనించారు. ప్రయణించిన ప్రతి ప్రదేశంలో అక్కడి మనుషులకు వ్యవసాయం గురించి దాన్ని ప్రాముఖ్యం గురించి వివరిస్తూ వచ్చారు. ఈ వింత జంట గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరూ మాట్లాడుకుంటున్నారు. వీరు చేసిన సాహసం ఒక మంచి అనుభూతి అని, మంచి అడ్వెంచర్ నెటిజెన్లు మెచ్చుకుంటున్నారు.

Updated Date - 2022-04-05T09:34:22+05:30 IST