ప్రపంచాన్ని కదిలించిన ఈ ఫొటో గుర్తుందిగా.. సైనికుడి చేతిలోని ఈ బాబు విషయంలో ఊహించని సంఘటన..!

ABN , First Publish Date - 2021-11-06T22:16:08+05:30 IST

పైన కనిపిస్తున్న ఫొటో గుర్తుంది కదా. ఆఫ్గాన్ సంక్షోభం నేపథ్యంలో బయటికచ్చిన ఈ ఫొటో అప్పట్లో ప్రపంచాన్ని కదిలించింది. ఆఫ్గాన్‌లో నెలకొన్న పరిస్థులకు అద్దం పట్టింది. ఈ ఫొటో అప్పట్లో నెట్టింట వైరల్ కావడంతో.. చూసిన ప్రతి ఒక్కరూ అక్కడి పరిస్థితులను తలచుకుని బాధపడ్డారు. పగవాడికి కూడా అటువంటి పరిస్థితులు రావొద్దని దేవుడిని వేడుకున్నారు. ఆ తర్వాత ఆ విషయా

ప్రపంచాన్ని కదిలించిన ఈ ఫొటో గుర్తుందిగా.. సైనికుడి చేతిలోని ఈ బాబు విషయంలో ఊహించని సంఘటన..!

ఇంటర్నెట్ డెస్క్: పైన కనిపిస్తున్న ఫొటో గుర్తుంది కదా. ఆఫ్గాన్ సంక్షోభం నేపథ్యంలో బయటికొచ్చిన ఈ ఫొటో అప్పట్లో ప్రపంచాన్ని కదిలించింది. ఆఫ్గాన్‌లో నెలకొన్న పరిస్థితులకు అద్దం పట్టింది. ఈ ఫొటో అప్పట్లో నెట్టింట వైరల్ కావడంతో.. చూసిన ప్రతి ఒక్కరూ అక్కడి పరిస్థితులను తలచుకుని బాధపడ్డారు. పగవాడికి కూడా అటువంటి పరిస్థితులు రావొద్దని దేవుడిని వేడుకున్నారు. ఆ తర్వాత ఆ  విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. అయితే తాజాగా ఈ ఫొటోలో కనిపిస్తున్న బాబుకు సంబంధించి ఓ సంచలన విషయం బయటికొచ్చింది. ఆ చిన్నారి ఆచూకి నేటీకి తల్లిదండ్రులకు దొరకలేదు. ఈ విషయం ప్రస్తుతం చర్చనీయాంశం అయింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. 


అమెరికా సైనిక బలగాల నీడలో ఆఫ్గానిస్థాన్ ప్రభుత్వం సుమారు 20ఏళ్లపాటు అక్కడి ప్రజలను పాలించింది. అయితే అమెరికా అనూహ్య నిర్ణయంతో రెండు దశాబ్దాల తర్వాత అగ్రరాజ్య సైనిక బలగాలు క్రమంగా ఆఫ్గాన్‌ను వీడటం ప్రారంభించాయి. ఈ క్రమంలోనే ఎప్పటి నుంచో అవకాశం కోసం వేచి చూస్తున్న తాలిబన్లు.. ఆఫ్గాన్‌ను ఆక్రమించారు. దీంతో ఆఫ్గాన్ ప్రజలు భయాందోళలను గురయ్యారు. తాలిబన్ల పాలనలో జీవించలేమని ప్రాణాలను రిస్క్ చేసి మరీ.. ఇతర దేశాలకు పయనమయ్యారన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగానే ఆఫ్గాన్‌లోని యూఎస్ ఎంబసీ వద్ద వాచ్‌మెన్‌గా పని చేస్తున్న మీర్జా అలీ మహ్మద్.. తన భార్య ఐదురుగు పిల్లలతో కలిసి దేశం విడిచేందుకు కాబూల్‌ ఎయిర్‌పోర్టుకు బయల్దేరారు. ఎయిర్ పోర్ట్ గేటు వద్ద ఎక్కవ మంది ఉండటంతో తొందరగా విమానాశ్రయంలోపలికి వెళ్లలేకపోయారు. 


ఈ క్రమంలో గేటు వద్దే నిరీక్షిస్తున్న మీర్జా అలీ దంపతులకు.. సాయం చేసేందుకు ఓ సైనికుడు ముందుకొచ్చాడు. దీంతో తమ పరిస్థితి ఎలా ఉన్నా.. తమ రెండు నెలల కొడుకు బాగుండాలని చిన్నారి(సోహెల్)ని ఆ సైనికుడి చేతికి అందించాడు. ఆ తర్వాత అరగంటకు మీర్జా అలీ తన కుటుంబంతో సహా ఎయిర్‌పోర్టులోకి ప్రవేశించాడు. అనంతరం తన కొడుకు కోసం వెతుకులాట ప్రారంభించాడు. ఆచూకీ లభ్యం కాకపోవడంతో.. అక్కడే ఉన్న సైనికులను అడిగి చూశాడు. చిన్న పిల్లలు వేరే ప్రదేశంలో ఉన్నారని వాళ్లు చెప్పడంతో అక్కడికి వెళ్లాడు. అయితే సైనికులు చెప్పిన ప్రదేశంలో పిల్లలెవరూ లేకపోవడంతో అతడు కంగుతిన్నాడు. గంటల తరబడి వెతికినా ఫలితం లేకపోవడంతో బరువెక్కిన హృదయంతోనే.. కుటుంబ సభ్యులతో కలిసి రెస్క్యూ విమానంలో ఖతర్ బయల్దేరాడు. ఆ తర్వాత జర్మనీ వెళ్లి, అక్కడ నుంచి శరణార్థిగా అమెరికా చేరుకున్నాడు. 


ప్రస్తుతం టెక్సాస్‌లోని శరణార్థుల కేంద్రంలో నలుగురు పిల్లలలో కలిసి ఉంటున్న మీర్జా అలీ దంపతులు.. సోహెల్‌ జాడ కోసం 80 రోజలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఈ దంపతులకు ఆఫ్గాన్ రెఫ్యూజీ సపోర్ట్ గ్రూప్ కూడా సహాయం చేస్తోంది. తమ కొడుకు ఆచూకీ తప్పకుండా దొరుకుతుంది అనే నమ్మకంతో ఈ దంపతులు వేచి చూస్తున్నారు. కాగా.. ఈ కేసుపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని అమెరికా అధికారులు పలు ఏజెన్సీలను కోరారు. 



Updated Date - 2021-11-06T22:16:08+05:30 IST