మ్యుజిషియన్ వాద్య పరికరాన్ని తగులబెట్టిన తాలిబన్లు

ABN , First Publish Date - 2022-01-16T21:05:08+05:30 IST

మ్యుజిషియన్‌కు జీవనోపాధి కల్పిస్తున్న వాద్య పరికరాన్ని ఆయన

మ్యుజిషియన్ వాద్య పరికరాన్ని తగులబెట్టిన తాలిబన్లు

కాబూల్ : ఓ మ్యుజిషియన్‌కు జీవనోపాధి కల్పిస్తున్న వాద్య పరికరాన్ని ఆయన కళ్ళ ముందే ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లు తగులబెట్టారు. పదుల సంఖ్యలో ప్రజలు ఈ దుశ్చర్యను చూశారు. తన వాద్య పరికరం కాలిపోతూ ఉంటే ఆ వ్యక్తి నిస్సహాయంగా ఏడుస్తూ ఉంటే ఓ తాలిబన్ ఉగ్రవాది ఎగతాళిగా నవ్వాడు. ఈ దృశ్యాన్ని మరొక ఉగ్రవాది చిత్రీకరించాడు. దీనికి సంబంధించిన వీడియోను అబ్దుల్‌హక్ ఒమేరీ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. 


ఆఫ్ఘనిస్థాన్‌లోని పక్తియా ప్రావిన్స్, జజాయ్ అరుబ్ జిల్లాలో ఈ సంఘటన జరిగినట్లు ఒమేరీ పేర్కొన్నారు. వాహనాల్లో సంగీతాన్ని వినడం, వాయించడంపై తాలిబన్లు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. వివాహ వేడుకల్లో స్త్రీ, పురుషులు వేర్వేరు గదుల్లో సంగీత కార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశించారు. 




Updated Date - 2022-01-16T21:05:08+05:30 IST