ప్రత్యేకంగా సమావేశం కానున్న AFRC

ABN , First Publish Date - 2022-10-03T16:55:50+05:30 IST

ఇంజనీరింగ్‌ ఫీజుల(Engineering fees)పై సోమవారం స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ అంశంపై చర్చించడానికి తెలంగాణ అడ్మిషన్స్‌ అండ్‌ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎ్‌ఫఆర్‌సీ) సోమవారం ఉదయం ప్రత్యేకంగా సమావేశం

ప్రత్యేకంగా సమావేశం కానున్న AFRC

ఇంజనీరింగ్‌ ఫీజులపై నేడు నిర్ణయం



హైదరాబాద్‌, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): ఇంజనీరింగ్‌ ఫీజుల(Engineering fees)పై సోమవారం స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ అంశంపై చర్చించడానికి తెలంగాణ అడ్మిషన్స్‌ అండ్‌ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎ్‌ఫఆర్‌సీ) సోమవారం ఉదయం ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఏఎ్‌ఫఆర్‌సీ(AFRC) ఛైర్మన్‌ జస్టిస్‌ స్వరూ్‌పరెడ్డి ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశంలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి, విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఇతర సభ్యులు పాల్గొననున్నారు. ఈ ఏడాదితో కలిపి మూడేళ్ల కాలానికి కొత్త ఫీజులను ఖరారు చేయాల్సి ఉన్న విషయం తెలిసిందే. ఇంజనీరింగ్‌ ఫీజులపై గతంలోనే కమిటీ పలు దఫాలుగా సమావేశాలను నిర్వహించి కసరత్తును పూర్తిచేసింది. ఆయా కాలేజీలకు ఎంత ఫీజులను పెంచాలనే విషయంలో ప్రతిపాదనలను కూడా సిద్ధం చేసింది. అయితే ఈ ఏడాదికి ఫీజులను పెంచకూడదని ఆ తర్వాత నిర్ణయించారు. దాంతో పలు కాలేజీలు కోర్టును ఆశ్రయించి.. తమతో సంప్రదింపుల సందర్భంగా ఏఎ్‌ఫఆర్‌సీ అంగీకరించిన ఫీజులను పెంచుకోవడానికి అనుమతిని తెచ్చుకున్నాయి. దాంతో ఫీజుల అంశంపై ఏఎ్‌ఫఆర్‌సీ మరోసారి వరుసగా సమావేశాలను నిర్వహిస్తోంది. అందులో భాగంగా కాలేజీలతో రెండో దఫా సంప్రదింపులను పూర్తిచేశారు. మరో 20 కాలేజీలతో ఈ ప్రక్రియను సోమవారం పూర్తి చేయనున్నారు. అనంతరం ఫీజుల ఖరారుపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Updated Date - 2022-10-03T16:55:50+05:30 IST