ఆఫ్రికా యువతిని పెళ్లాడిన తమిళ యువకుడు

ABN , First Publish Date - 2022-05-01T15:27:17+05:30 IST

కోయంబత్తూర్‌ తుడియలూరులోని ఓ కల్యాణ మండపంలో ఆఫ్రికాకు చెందిన క్రైస్తవ యువతిని హిందూ సంప్రదాయ ఆచారాల ప్రకారం ఓ తమిళ యువకుడు శనివారం

ఆఫ్రికా యువతిని పెళ్లాడిన తమిళ యువకుడు

ప్యారీస్‌(చెన్నై): కోయంబత్తూర్‌ తుడియలూరులోని ఓ కల్యాణ మండపంలో ఆఫ్రికాకు చెందిన క్రైస్తవ యువతిని హిందూ సంప్రదాయ ఆచారాల ప్రకారం ఓ తమిళ యువకుడు శనివారం వివాహం చేసుకున్నాడు. సుబ్రమణ్యం-ధర్మలక్ష్మిల కుమారుడు ముత్తుమారియప్పన్‌ ఎనిమిదేళ్ల కిత్రం ఆఫ్రికాలోని కెమెరూన్‌కు వెళ్లి అక్కడున్న గ్యాస్‌ కంపెనీలో సీఎస్సీ మిషన్‌ ఆపరేటర్‌గా  ఉద్యోగంలో చేరాడు. అదే సంస్థలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తూ వచ్చిన ఎమ్మాఎంజిమా మొసాకో కుమార్తె వాల్మిఇనంగా మొసాకోతో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. ఎనిమిదేళ్లుగా ప్రేమలో ఉన్న వీరికి వివాహం చేసేందుకు ఇరు కుటుంబాల సభ్యులు నిర్ణయించారు. శనివారం ఉదయం కోయంబత్తూర్‌ తుడియలూరు కల్యాణమండపంలో హిందూ సంప్రదాయం ప్రకారం రెండు కుటుంబాల సభ్యులు, బంధువులు, స్నేహితుల సమక్షంలో వివాహం జరిగింది.

Updated Date - 2022-05-01T15:27:17+05:30 IST