ప్రేమించి పెళ్లి చేసుకున్న పది నెలలకే భార్యాభర్తల ఆత్మహత్యలు.. కారణం ఏంటో తెలిస్తే షాక్!

ABN , First Publish Date - 2022-03-03T22:24:35+05:30 IST

ఆ యువ దంపతులకు పది నెలల కిందట వివాహం జరిగింది.. ప్రేమించి పెళ్లి చేసుకుని ఎన్నో కలలతో వైవాహిక జీవితాన్ని ప్రారంభించిన వారికి కష్టాలే ఎదురయ్యాయి..

ప్రేమించి పెళ్లి చేసుకున్న పది నెలలకే భార్యాభర్తల ఆత్మహత్యలు.. కారణం ఏంటో తెలిస్తే షాక్!

ఆ యువ దంపతులకు పది నెలల కిందట వివాహం జరిగింది.. ప్రేమించి పెళ్లి చేసుకుని ఎన్నో కలలతో వైవాహిక జీవితాన్ని ప్రారంభించిన వారికి కష్టాలే ఎదురయ్యాయి.. యువకుడికి ఉద్యోగం పోవడంతో ఆర్థిక సమస్యలు వెంటాడాయి.. తిండి తినడానికి కూడా డబ్బులు కరువయ్యాయి.. బంధువులు చులకనగా మాట్లాడుతుండడంతో ఆ యువతి ఇంట్లో ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఆ విషయం తెలుసుకున్న గంటల్లోనే ఆ యువకుడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. 


హర్యానాలోని అంబాలకు చెందిన రాజు అనే యువకుడు జలధార అనే యువతిని ప్రేమించి గతేడాది మే నెలలో వివాహం చేసుకున్నాడు. వివాహం జరిగిన ఐదు నెలల తర్వాత రాజు చేస్తున్న ఉద్యోగం పోయింది. దీంతో ఇంట్లో ఆర్థిక కష్టాలు మొదలై భార్యాభర్తల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. గర్భవతి అయిన భార్యపై రాజు రెండు వారాల క్రితం చెయ్యి చేసుకున్నాడు. దీంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. బుధవారం ఉదయం ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆమె ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.


జలధార ఆత్మహత్య విషయం తెలుసుకున్న రాజు తీవ్ర వేదనకు గురయ్యాడు. జలధార చనిపోయిన నాలుగు గంటల తర్వాత రాజు కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. జలధార పుట్టింటికి వెళ్లిన తర్వాత రాజు మనస్థాపానికి గురయ్యాడని, ఆమె చనిపోయిన వార్త తెలుసుకుని కుంగిపోయాడని, ఆ క్రమంలోనే ఆత్మహత్య చేసుకున్నాడని బంధువులు చెప్పారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. 

Updated Date - 2022-03-03T22:24:35+05:30 IST