రైతుల నుంచి ఆవు పేడే కాదు మూత్రం కూడా కొనుగోలు

ABN , First Publish Date - 2022-03-01T14:01:49+05:30 IST

రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ఆవు పేడతోపాటు ఆవు మూత్రాన్ని కూడా కొనుగోలు చేయాలని ఛత్తీస్‌ఘడ్ ప్రభుత్వం నిర్ణయించింది....

రైతుల నుంచి ఆవు పేడే కాదు మూత్రం కూడా కొనుగోలు

ఛత్తీస్‌ఘడ్ ప్రభుత్వం నిర్ణయం

రాయ్‌పూర్ : రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ఆవు పేడతోపాటు ఆవు మూత్రాన్ని కూడా కొనుగోలు చేయాలని ఛత్తీస్‌ఘడ్ ప్రభుత్వం నిర్ణయించింది.ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ ప్రారంభించిన ఆవు పేడ సేకరణ నమూనాలో రైతుల నుంచి ఆవు మూత్రాన్ని కొనుగోలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి సలహాదారు ప్రదీప్ శర్మ తెలిపారు.పశువుల పెంపకాన్ని లాభసాటిగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రైతుల నుంచి ఆవు పేడను కొనుగోలు చేస్తోంది. 20వ పశుగణన ప్రకారం ఛత్తీస్‌గఢ్‌లో  2,61,503 పశువులు ఉన్నాయి.


‘‘చత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఆవు పేడను సేకరించిన పద్ధతిలోనే పశువుల మూత్రాన్ని కూడా సేకరిస్తాం. మేం గ్రామ గౌతమ్ (పశువుల షెడ్) సమితి ద్వారా గోమూత్రాన్ని సేకరిస్తాం, ఆవు మూత్రం సేకరణపై పశువుల యజమానులు, రైతులకు పక్షం రోజులకు ఒకసారి డబ్బు చెల్లింపులు చేస్తాం’’అని ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ సలహాదారు ప్రదీప్ శ్రమ అన్నారు.గత 20 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం 6.4 మిలియన్ క్వింటాళ్ల ఆవు పేడను సేకరించి రెండు మిలియన్ల క్వింటాళ్ల ఆర్గానిక్ వర్మీకంపోస్టును ఉత్పత్తి చేసిందని శర్మ తెలిపారు.సేంద్రీయ పురుగుమందుల తయారీకి ఆవు మూత్రం ఉత్తమ మూల పదార్థం కాబట్టి ప్రభుత్వం రైతుల నుంచి దీన్ని కొనుగోలు చేయాలని యోచిస్తోందని శర్మ చెప్పారు.


ఆవు మూత్రం కొనుగోలుకు సీఎం ఆమోదం తెలిపారని, త్వరలో కొనుగోలుకు ముసాయిదాను సిద్ధం చేస్తామని అధికారులు చెప్పారు.పశువుల మూత్రంతో తయారు చేసిన సేంద్రీయ పురుగుమందులను రైతులు ఉపయోగిస్తున్నారని, ఇది పంటకు, నేలకు, ప్రజలకు కూడా ఉపయోగపడుతుందని రాయ్‌పూర్‌లోని వ్యవసాయ శాస్త్రవేత్త సీతారాం పటేల్ చెప్పారు.


Updated Date - 2022-03-01T14:01:49+05:30 IST