పెళ్లికి నో చెప్పారని.. పెద్దలను ఎదిరించి బయటికెళ్లిన బావామరదళ్లు.. బస్సులో వెళ్తూ వాళ్లు చేసిన పనికి.. అంతా షాక్..

Published: Thu, 23 Dec 2021 19:08:50 ISTfb-iconwhatsapp-icontwitter-icon
పెళ్లికి నో చెప్పారని.. పెద్దలను ఎదిరించి బయటికెళ్లిన బావామరదళ్లు.. బస్సులో వెళ్తూ వాళ్లు చేసిన పనికి.. అంతా షాక్..ప్రతీకాత్మక చిత్రం

ప్రేమ వివాహాలను సాధారణంగా పెద్దలు ఒప్పుకోరు. తమ పరువు పోతుందనే కారణంతో కొంతమంది కూతుళ్లపై దాడులు చేయడం, చంపడం కూడా చేస్తుంటారు. ఇలాంటి ఘటనలు ఇటీవల చాలా చూస్తున్నాం. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ప్రేమికులు.. వరుసకు బావామరదళ్లు. అయినా వారి పెద్దలు మాత్రం పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో వారు ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పెద్దలను ఎదిరించి బయటకి వెళ్లిపోయారు. ఆర్టీసీ బస్సులో వెళ్తూ ఆ బావామరదళ్లు చేసిన పనికి అంతా షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే..

తమిళనాడులోని విల్లుపురం జిల్లాకు చెందిన రాజేష్‌కు కాంచీపురం జిల్లాకు చెందిన లోకేశ్వరి వరుసకు మరదలు అవుతుంది. బావామరదళ్లు కావడంతో చనువుగా ఉండడంతో పాటూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. చాలా ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఎలాగూ బంధువులే కాబట్టి, తమ పెళ్లికి ఎలాంటి అడ్డంకులు ఉండవనుకున్నారు. ఈ క్రమంలో ఓ రోజు తమ ప్రేమ, పెళ్లి విషయాన్ని పెద్దల వద్ద ప్రస్తావించారు. కారణాలు ఏవో తెలీదుగానీ.. వీరి పెళ్లికి మాత్రం పెద్దలు అంగీకరించలేదు. అయినా వారు మాత్రం ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

పెద్దలు ఒప్పుకోకపోయినా పెళ్లిచేసుకున్నారు... మ్యారేజ్ సర్టిఫికెట్ కోసం ఆఫీసుకు వెళితే.. అక్కడ ఊహించని సీన్..

పెద్దలు పెళ్లికి ఒప్పుకోకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. ఇద్దరూ మాట్లాడుకుని బయటికి వెళ్లి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇటీవల ఇంటి నుంచి బయటికెళ్లి బెంగళూరు చేరుకున్నారు. అనంతరం అక్కడ నుంచి సాలెం వెళ్లే బస్సు ఎక్కారు. పెళ్లి చేసుకోవాలని బస్సు ఎక్కిన వారు.. ఏమనుకున్నారో ఏమోగానీ బస్సు సాలెంకు చేరుకుంటుందనగా విషం తాగారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన వారిని చూసి ప్రయాణికులంతా షాక్ అయ్యారు. వెంటనే చికిత్స నిమిత్తం వారిని సాలెం ఆస్పత్రికి తరలించారు. సరైన సమయానికి చికిత్స అందించడంతో ప్రాణాపాయం తప్పింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అర్ధరాత్రి రోడ్డుపై కానిస్టేబుల్ అసభ్య ప్రవర్తన.. తాను పోలీసునంటూ యువతిపై సెల్ లైట్ వేసి.. చివరకు..

ఇవి కూడా చదవండిLatest News in Telugu

65ఏళ్ల వృద్ధుడితో వివాహేతర సంబంధం.. ఉన్నట్టుండి మహిళ అదృశ్యం.. చివరగా వృద్ధుడు చెప్పిన కారణాలు విని..పెళ్లయి నెల కూడా కాకముందే పుట్టింటికి వెళ్లిపోయిన భార్య.. భర్త బలవన్మరణం.. షాకింగ్ నిజాలు చెప్పిన మరిదిజీవితాన్ని మార్చేసిన తొమ్మిది ప్రశ్నలు.. రూ.కోటి ప్యాకేజీతో జాబ్ ఇచ్చేందుకు Amazon అడిగిన ప్రశ్నలివే..!పెళ్లయిన మూడు నెలలకే నవవధువు అదృశ్యం.. ఫోన్ చేస్తే స్విచాఫ్.. అసలు నిజం తెలిసి ఆ భర్తకు..ఊహించని కారణంతో మూడేళ్ల క్రితం చెట్టును పెళ్లి చేసుకున్న యువతి.. ఇప్పుడు ఏం చెప్తోందంటే..బస్సు టికెట్‌పై ఫోన్ నెంబర్ రాసి ఇచ్చిన కండక్టర్.. ఆ ప్రయాణికురాలు ఇచ్చిన ట్విస్ట్‌ మామూలుగా లేదుగా..!
Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.