Viral News: పెళ్లి తర్వాత వధువు నెత్తిన తండ్రి ఉమ్మి.. అత్తారింటికి పంపిస్తాడట..!

ABN , First Publish Date - 2022-07-28T18:37:27+05:30 IST

పెళ్లైన తర్వాత సాధారణంగా ఎక్కడైన వధువును ఆమె తల్లిదండ్రులు బరువెక్కిన హృదయంతో అత్తారింటికి సాగనంపుతారు. ఆమె చేతిని వరుడి చేతిలో పెడుతూ.. జాగ్రత్తలు చెబుతారు. కానీ ఓ ప్రదేశంలో మాత్రం.. వధువును వెరైటీగా అత్తారింటికి పంపిస్తారు.

Viral News: పెళ్లి తర్వాత వధువు నెత్తిన తండ్రి ఉమ్మి.. అత్తారింటికి పంపిస్తాడట..!

ఇంటర్నెట్ డెస్క్: పెళ్లైన తర్వాత సాధారణంగా ఎక్కడైన వధువును ఆమె తల్లిదండ్రులు బరువెక్కిన హృదయంతో అత్తారింటికి సాగనంపుతారు. ఆమె చేతిని వరుడి(Groom) చేతిలో పెడుతూ.. జాగ్రత్తలు చెబుతారు. కానీ ఓ ప్రదేశంలో మాత్రం.. వధువు(Bride)ను వెరైటీగా అత్తారింటికి పంపిస్తారు. పెళ్లి అనంతరం వధువుకు గుండు చేయిస్తారు. అంతేకాకుండా తండ్రి ఆమె తలపై ఉమ్మి.. తర్వాత వరుడి వెంట అత్తారింటికి సాగనంపుతాడు. వినడానికి విచిత్రంగా ఉన్నా.. ఇది నిజం. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


మన దేశంలో కోయలు, నాయక పోడులు, కోటియాలు ఇలా అనేక గిరిజన తెగలు ఉన్నాయి. అలాగే ప్రపంచ వ్యాప్తంగా కూడా ఆదివాసీల తెగలు చాలానే ఉన్నాయి. అయితే మనం ఇప్పుడు చెప్పుకోబోయేది మాత్రం కెన్యా(Kenya ), టాంజానియా(Tanzania)లో కనబడే మసాయి(Masai) గిరిజన జాతి గురించి. ఈ తెగ‌కు సంబంధించిన గిరిజన ప్రజలు.. అనాదిగా ఓ సంప్రదాయాన్ని కొనసాగిస్తు్న్నారు. పెళ్లీడు కొచ్చిన కూతురి కోసం ఈ గిరిజన జాతి(Tribals)కి చెందిన తల్లిదండ్రులు.. సంబంధాలు చూస్తారు. అనంతరం వరుడికి కట్నకానుకలు సమర్పించి మరీ కూతురి పెళ్లి(Marriage) ఘనంగా జరిపిస్తారు. వివాహానంతరం వధువు నెత్తిపై, ఛాతిపై ఆమె తండ్రి ఉమ్మి.. కూతురుని అత్తారింటికి సాగనంపుతాడు. అలాగే కుటుంబంలోని పెద్దలు కూడా.. ఆశీర్వాదం కోసం మోకాళ్లపై కూర్చున్న వధువు తలపై ఉమ్ముతారు.



 వాళ్లు చేసే పని మనకు విచిత్రంగా అనిపించినా అది వాళ్ల సంప్రదాయమట. తండ్రి అలా ఉమ్మటాన్ని ఆ పెళ్లి కూతురు కూడా ఆశీర్వాదంగా భావిస్తుందట. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. పెళ్లి తర్వాత వధువుకు గుండు చేయించటం అక్కడ ఆచారమట. అత్తారింటికి వెళ్లే సమయంలో వధువు వెనక్కి తిరిగి చూడకూడదట. ఇలా చేస్తే ఆమె రాయిగా మారుతుందనే గట్టి నమ్మకం అక్కడి ప్రజలు చెబుతున్నారు. వందల సంవత్సరాలుగా ఇక్కడ ఈ సంప్రదాయం కొనసాగుతుందని అక్కడి గిరిజనులు అంటున్నారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే.. అతిథి ఎవరైనా ఇంటికొస్తే అరచేతిలో ఉమ్మి.. వారికి స్వాగతం పలుకుతారట. 


Updated Date - 2022-07-28T18:37:27+05:30 IST