Muslim couple: దేవాలయంలో ముస్లిం జంట మళ్లీ పెళ్లి

ABN , First Publish Date - 2022-09-20T14:49:05+05:30 IST

ఓ ముస్లిం అమెరికన్ జంట(Muslim American couple) దేవాలయంలో(UP temple) హిందూ సంప్రదాయబద్ధంగా(Hindu style) మళ్లీ పెళ్లి చేసుకున్న...

Muslim couple: దేవాలయంలో ముస్లిం జంట మళ్లీ పెళ్లి

లక్నో(ఉత్తరప్రదేశ్): ఓ ముస్లిం అమెరికన్ జంట(Muslim American couple) దేవాలయంలో(UP temple) హిందూ సంప్రదాయబద్ధంగా(Hindu style) మళ్లీ పెళ్లి చేసుకున్న ఘటన ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) రాష్ట్రంలో జరిగింది. అమెరికా సంతతికి చెందిన ముస్లిం జంట(American-origin Muslim couple) కియామా దిన్ ఖలీఫా, కేషా ఖలీఫాలు జౌన్‌పూర్‌లోని త్రిలోచన్ మహాదేవ్ ఆలయంలో వివాహం(marriage) చేసుకున్నారు.18 ఏళ్ల క్రితం నికాహ్(nikah) (పెళ్లి) చేసుకున్న ఖలీపా దంపతులకు 9మంది పిల్లలు ఉన్నారు.ఈ దంపతులకు ఆలయంలో హిందూ సంప్రదాయం ప్రకారం ఆలయ పూజారి రవిశంకర్ గిరి మళ్లీ పెళ్లి చేశారు.తన తాత భారతీయ సంతతికి చెందిన హిందువు అని కేషా ఖలీఫా పేర్కొన్నారు.


పెళ్లికి సంబంధించిన అన్ని ఆచార వ్యవహారాలు హిందూ సంప్రదాయాల ప్రకారం పూర్తయ్యాయని దంపతులతో పాటు వచ్చిన పండిట్ గోవింద్ శాస్త్రి తెలిపారు.ముస్లిం దంపతులు హిందూ ఆచారాల ప్రకారం అగ్నిని సాక్షిగా భావించి త్రిలోచన్ మహాదేవ్ ఆలయంలో ఏడు ప్రదక్షిణలు చేశారు.ముస్లిం దంపతులు భారతదేశ పర్యటనలో(tour India) భాగంగా వారణాసి ఘాట్‌లు, దేవాలయాలు, ఇతర మతపరమైన ప్రదేశాలను సందర్శించిన సమయంలో హిందూ సంస్కృతి పట్ల ఆకర్షితులయ్యారు.దీంతో వారు హిందూ ఆచారాల ప్రకారం మళ్లీ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.


పెళ్లి రోజున ఈ జంటకు పాస్‌పోర్ట్, వీసా లేకపోవడంతో వివాహ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ లేకుండానే వారి దేశానికి తిరిగి వెళ్లాల్సి వచ్చింది. వారు వివాహం రిజిస్ట్రేషన్  పత్రాలను సమర్పించిన మరుసటి రోజు వివాహ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ అందుకున్నారు.


Updated Date - 2022-09-20T14:49:05+05:30 IST