సాయిధరమ్‌ తేజ్‌‌కు ప్రమాదం జరిగిన తర్వాత Hyderabad లో పరిస్థితి ఇదీ...

ABN , First Publish Date - 2021-09-15T14:45:10+05:30 IST

సినీ హీరో సాయిధరమ్‌ తేజ్‌ ప్రమాదంతో రహదారులపై..

సాయిధరమ్‌ తేజ్‌‌కు ప్రమాదం జరిగిన తర్వాత Hyderabad లో పరిస్థితి ఇదీ...

  • జీహెచ్‌ఎంసీకి జరిమానా వేయరా..!?
  • గ్రేటర్‌లో రహదారుల దుస్థితికి కారణం వారే 

హైదరాబాద్ సిటీ : భాగ్యనగరంలోని రహదారులు. గుంతలు మాత్రమే కాదు.. కంకర, ఇసుక, మట్టి కుప్పలతో రోడ్లు అధ్వానంగా మారాయి. సినీ హీరో సాయిధరమ్‌ తేజ్‌ ప్రమాదంతో రహదారులపై మట్టి/ఇసుక, కంకర ఉండడం చర్చనీయాంశమైంది. ఇదే కారణంతో నిత్యం నగరంలో పదుల సంఖ్యలో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. సెలబ్రిటీ కావడంతో ప్రమాదస్థలి వద్ద మట్టి ఉండడాన్ని జీహెచ్‌ఎంసీ తీవ్రంగా పరిగణించింది. అందుకు కారణమైన నిర్మాణ సంస్థకూ అధికారులు రూ. లక్ష జరిమానా వేశారు. 


ఇసుక, కంకర వల్ల సామాన్యులు ప్రమాదానికి గురైతే యంత్రాంగం ఎందుకు స్పందించదు.? ప్రమాదాల్లో సాధారణ వ్యక్తులు గాయపడరా, వారివి ప్రాణాలు కాదా.. అని జీహెచ్‌ఎంసీ తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. నగరంలోని చాలా ప్రాంతాల్లో రహదారులపై ఇసుక, కంకర మేటలకు జీహెచ్‌ఎంసీ అధికారుల నిర్లక్ష్యమే కారణం. మరి జీహెచ్‌ఎంసీకి, సంబంధిత అధికారులకు ఎందుకు జరిమానా విధించరని పౌరులు ప్రశ్నిస్తున్నారు. 



Updated Date - 2021-09-15T14:45:10+05:30 IST