టీచర్లకు ఉత్తర్వులు అందజేస్తున్న డీఈవో నరసింహారెడ్డి
చిత్తూరు(సెంట్రల్), జనవరి 16: డీఈవో పూల్‌లో ఉన్న పలువురు టీచర్లకు ఆరునెలల తర్వాత పాఠశాలల కేటాయింపు జరిగింది. శనివారం జిల్లా విద్యాశాఖ కార్యాలయ సమావేశ మందిరంలో బాషా పండితులకు కౌన్సెలింగ్ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం డీఈవో నరసింహారెడ్డి స్థానాల కేటాయింపునకు సంబంధించి ఆయా ఉపాధ్యాయులకు ఉత్తర్వులు అందజేశారు. ఆ మేరకు.. తెలుగు భాషా పండితులు - 70మంది, హిందీ భాషా పండితులు - 34మంది, ఓకేషనల్ విభాగం- ముగ్గురు, ఉర్దూ భాషా పండితులు -ఇద్దరు, డ్రాయింగ్ విభాగంలో ముగ్గురికి పాఠశాలల కేటాయింపు జరిగింది. కాగా, డీఈవో పూల్‌లో ఉంటూ కోర్టును ఆశ్రయించిన 48 మందిని ప్రస్తుతం పనిచేస్తున్న చోటే కొనసాగించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. కార్యక్రమంలో విద్యాశాఖ సూపరింటెండెంట్లు, పీడీలు తదితరులు పాల్గొన్నారు.