నదిలో పడిన ఫోన్.. 10నెలల తర్వాత దొరికింది.. షాకింగ్ విషయం ఏంటంటే..!

ABN , First Publish Date - 2022-06-30T17:46:30+05:30 IST

10నెలలపాటు నీటిలో ఉన్నప్పటికీ ఐఫోన్ చెక్కు చెదరలేదు. చార్జింగ్ పెట్టి, స్విచ్ఛాన్ చేయగానే అది చక్కగా పని చేస్తోంది. ఈ క్రమంలో పోయిన ఫోన్ దొరకడం.. అది పూర్తి వర్కింగ్ కండిషన్‌లో ఉండటం పట్ల దాని యజమాని సంతోషం

నదిలో పడిన ఫోన్.. 10నెలల తర్వాత దొరికింది.. షాకింగ్ విషయం ఏంటంటే..!

ఇంటర్నెట్ డెస్క్: 10నెలలపాటు నీటిలో ఉన్నప్పటికీ ఐఫోన్ చెక్కు చెదరలేదు. చార్జింగ్ పెట్టి, స్విచ్ఛాన్ చేయగానే అది చక్కగా పని చేస్తోంది. ఈ క్రమంలో పోయిన ఫోన్ దొరకడం.. అది పూర్తి వర్కింగ్ కండిషన్‌లో ఉండటం పట్ల దాని యజమాని సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త నెట్టింట వైరల్‌గా మారింది. కాగా.. ఇంతకూ ఆ ఫోన్ ఎవరిదీ? దాన్ని అతడు ఎలా పోగొట్టుకున్నాడు? తిరిగి అది అతడి వద్దకు ఎలా వచ్చింది? అనే పూర్తి వివరాలను ఓసారి పరిశీలిస్తే..



యూకేకు చెందిన డేవీస్ అనే వ్యక్తి గత ఏడాది ఆగస్టులో కుటుంబ సభ్యులు స్నేహితులతో కలిసి విహార యాత్రకు వెళ్లాడు. ఆ సందర్భంగా అతడు.. వేయ్ నదిలో పడవ ప్రయాణం చేశాడు. ఈ నేపథ్యంలో అతడి ఫోన్.. ప్రమాదవశాత్తు నదిలో పడిపోయింది. దీంతో అతడు అల్లాడిపోయాడు. ముఖ్యమైన ఫొటోలు ఉన్న ఫోన్‌ నదిలో పడిపోవడంపట్ల బాధపడ్డాడు. అనంతరం చేసేదేమీ లేక.. తిరిగి ఇంటికి పయనమయ్యాడు. కాలం గడిచే కొద్ది అతడు తన ఫోన్ విషయాన్ని మరచిపోయాడు. Gloucestershire ప్రాంతానికి చెందిన మిగ్యుల్ అనే వ్యక్తికి ఆ ఫోన్ దొరకడం.. అది పూర్తి వర్కింగ్ కండిషన్‌లో ఉన్నట్టు గ్రహించి.. దాని యజమానిని గుర్తించేందుకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడంతో ఎట్టకేలకు ఆ ఫోన్ డేవీస్‌ చెంతకు చేరింది. అయితే తాజాగా 10నెలల క్రితం పోగొట్టుకున్న ఫోన్.. తన చెంతకు చేరడంతో సంతోషం వ్యక్తం చేశాడు. అంతేకాకుండా ఫోన్‌ను తనకు పంపించినందుకుగానూ డేవీస్.. మిగ్యుల్‌కు ధన్యవాదాలు తెలిపాడు. కాగా.. 10నెలలపాటు నీటిలో ఉన్న ఫోన్ పూర్తి వర్కింగ్ కండిషన్‌లో ఉండటం పట్ల నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. 


Updated Date - 2022-06-30T17:46:30+05:30 IST