2 నెలల తర్వాతే అమల్లోకి పెంచిన విద్యుత్‌ చార్జీలు

ABN , First Publish Date - 2022-07-20T16:28:32+05:30 IST

రాష్ట్రంలో పెంచిన విద్యుత్‌ చార్జీలు అమలుకు వచ్చేందుకు కనీసం రెండు నెలల సమయం పడుతుందని విద్యుత్‌ బోర్డు అధికారులు వెల్లడించారు. అప్పుల

2 నెలల తర్వాతే అమల్లోకి పెంచిన విద్యుత్‌ చార్జీలు

అడయార్‌(చెన్నై), జూలై 19: రాష్ట్రంలో పెంచిన విద్యుత్‌ చార్జీలు అమలుకు వచ్చేందుకు కనీసం రెండు నెలల సమయం పడుతుందని విద్యుత్‌ బోర్డు అధికారులు వెల్లడించారు. అప్పుల ఊబిలో కూరుకునివున్న విద్యుత్‌ బోర్డును రక్షించేందుకు కరెంట్‌ చార్జీలను పెంచుతున్నట్టు విద్యుత్‌ శాఖామంత్రి సెంథిల్‌ బాలాజి సోమవారం వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే, ఈ పెంచిన విద్యుత్‌ చార్జీలను అమల్లోకి తెచ్చే ముందు విద్యుత్‌ రెగ్యులేటరీ అథారిటీ అనుమతి తీసుకోవాల్సి ఉంది. అలాగే, ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ కూడా చేపట్టాల్సి ఉంది. ఈ ప్రక్రియలు పూర్తయ్యేందుకు కనీసం రెండు నెలల సమయం పడుతుందని, ఆ తర్వాతే ఈ పెంచిన చార్జీలు అమల్లోకి వస్తాయని విద్యుత్‌ బోర్డు అధికారులు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - 2022-07-20T16:28:32+05:30 IST