ప్రజలపై ఇంకెన్నాళ్లీ బాదుడు : టీడీపీ

ABN , First Publish Date - 2022-07-06T05:31:51+05:30 IST

వైసీపీ ప్రభుత్వంలో చార్జీలు, ధ రల పెంపుతో ప్రజలపై ఎన్నిసార్లు బాదుడు విధిస్తారని టీడీపీ నా యకులు ప్రశ్నించారు. ఆర్టీసీ చార్జీల పెంపును నిరసిస్తూ మంగళవారం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండు ఎదుట తెలుగుతమ్ముళ్లు ఆం దోళనకు దిగారు.

ప్రజలపై ఇంకెన్నాళ్లీ బాదుడు : టీడీపీ
హిందూపురం ఆర్టీసీ బస్టాండు ఎదుట ప్రధాన రహదారిపై బైఠాయించిన టీడీపీ శ్రేణులు

హిందూపురం టౌన, జూలై 5: వైసీపీ ప్రభుత్వంలో చార్జీలు, ధ రల పెంపుతో ప్రజలపై ఎన్నిసార్లు బాదుడు విధిస్తారని టీడీపీ నా యకులు ప్రశ్నించారు. ఆర్టీసీ చార్జీల పెంపును నిరసిస్తూ మంగళవారం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండు ఎదుట తెలుగుతమ్ముళ్లు ఆం దోళనకు దిగారు. ప్రధాన రహదారిపై బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈసందర్భంగా నాయకులు మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చాక పన్నుల భారం పెరగడంతో పాటు ఆర్టీసీ, విద్యుత చార్జీలు పెంచుతూ సామాన్యులను నట్టేట ముంచుతున్నారన్నారు. రెండు నెలల క్రితమే ఆర్టీసీ చార్జీలు పెం చారని, తాజాగా మరోసారి చార్జీలు భారీగా పెంచేశారన్నారు. సా మాన్యులు ఆర్టీసీలో ప్రయాణించాలంటేనే భయపడే పరిస్థితి తెచ్చారన్నారు. అధికారంలోకి రాకముందు చెప్పిన హామీలు ఏమయ్యాయని నిలదీశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 


బీరేపల్లిలో బాదుడే బాదుడు.. 

హిందూపురం మండలం బీరేపల్లిలో సాయంత్రం టీడీపీ ఆధ్వర్యంలో బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించారు. నాయకులు గ్రామంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈసందర్భంగా నాయకులు మా ట్లాడుతూ పెంచిన విద్యుత చార్జీలు, రెండు నెలల్లో మరోసారి పెం చిన ఆర్టీసీ చార్జీలను తగ్గించాలని డిమాండ్‌ చేశారు. అధికారంలోకి రావడానికి ఒక్కచాన ్స అంటూ వచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్న ముఖ్యమంత్రికి ఇక పాలించే అధికారం లేదన్నారు. పల్లెల్లో అధికార పార్టీ నాయకులను ఛీ కొడుతున్నారని అన్నారు. కార్యక్రమంలో మం డల కన్వీనర్‌ అశ్వర్థనారాయణరెడ్డి, ఆదినారాయణప్ప, రాము, రమే ష్‌, రవీంద్రరెడ్డి, రామాంజి, హనుమంతరాయుడు, రామక్రిష్ణారెడ్డి, త దితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-06T05:31:51+05:30 IST