పాటతో మళ్లీ...

ABN , First Publish Date - 2021-03-07T05:42:48+05:30 IST

కొంత విరామం తర్వాత బాలీవుడ్‌ బ్యూటీ అలియాభట్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సెట్‌లో అడుగుపెట్టబోతున్నారు. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రామ్‌చరణ్‌కు జోడీగా సీత పాత్రలో కనిపించనున్నారామె. గత ఏడాది డిసెంబర్‌లో రామోజీ ఫిల్మ్‌సిటీలో

పాటతో మళ్లీ...

కొంత విరామం తర్వాత బాలీవుడ్‌ బ్యూటీ అలియాభట్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సెట్‌లో అడుగుపెట్టబోతున్నారు. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రామ్‌చరణ్‌కు జోడీగా సీత పాత్రలో కనిపించనున్నారామె. గత ఏడాది డిసెంబర్‌లో రామోజీ ఫిల్మ్‌సిటీలో జరిగిన షెడ్యూల్‌లో అలియాపై కీలక సన్నివేశాలు తెరకెక్కించిన సంగతి తెలిసిందే.


ఆ షెడ్యూల్‌ పూర్తయ్యాక అలియా ముంబై చేరుకున్నారు. తాజాగా ఈ నెల 12న మరోసారి ఆమె ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సెట్‌లో సందడి చేయబోతున్నారు. హైదరాబాద్‌లో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో రామ్‌చరణ్‌, అలియాపై రొమాంటిక్‌ సాంగ్‌ చిత్రీకరణ చేయనున్నారట. ప్రస్తుతం అందుకు సంబంధించిన కార్యక్రమాలు జరుగుతున్నాయని యూనిట్‌ వర్గాల నుంచి సమాచారం. డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో జూనియర్‌ ఎన్టీఆర్‌ కొమురం భీమ్‌గా నటిస్తున్నారు. ఆయనకు జోడీగా ఒలీవియా మోరీస్‌ నటిస్తున్నారు.

Updated Date - 2021-03-07T05:42:48+05:30 IST