ముస్లింలను మోసం చేసిన జగన్‌

Published: Sat, 25 Jun 2022 00:49:20 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ముస్లింలను మోసం చేసిన జగన్‌జగన్‌ బుద్ధి మారాలని దర్గాలో టీడీపీ మైనార్టీ నాయకులు ప్రత్యేక ప్రార్థనలు

కొండపల్లి(ఇబ్రహీంపట్నం), జూన్‌ 24: ముస్లి మైనార్టీలను  విస్మరిస్తున్న సీఎం జగన్‌రెడ్డికి మంచి బుద్ధిని ప్రసాదించాలని రాష్ట్ర మైనార్టీ సెల్‌ ఉపాధ్యక్షుడు షేక్‌ కరిముల్లా అన్నారు. జిల్లా మైనార్టీ సెల్‌ ఉపాధ్యక్షుడు ఎం.డి.అప్సర్‌ ఆధ్వర్యంలో హజరత్‌ సయ్యద్‌ షాబుఖారీ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కరిముల్లా మాట్లాడుతూ ముస్లింలపై ప్రభుత్వం కపట ప్రేమ చూపిస్తుందన్నారు. ఆడపిల్లల దుల్హన్‌ పథకం రద్దు చేయటం దారుణమన్నారు. జిల్లా మైనార్టీ సెల్‌ ఉపాధ్యక్షులు ఎం.డి.అప్సర్‌ మాట్లాడుతూ అబ్దుల్‌ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకున్న దారుణ సంఘటనలు ఈ ప్రభుత్వ అసమర్థత వలన చోటుచేసుకుందని అన్నారు.  మైనార్టీ సెల్‌ నాయకులు షేక్‌ గోరే, మహబూబ్‌ సుభాని, నాగుల్‌ మీరా, ఖాజా, సయ్యద్‌ పర్హాన్‌, గోరేబాషా, తదితరులు పాల్గొన్నారు.


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.