భారత్‌ను విశ్వగురువుగా తీర్చిదిద్దే నూతన విద్యా విధానం

ABN , First Publish Date - 2020-11-30T04:54:40+05:30 IST

భారత్‌ను విశ్వ గురువుగా తీర్చిదిద్దే నూతన జాతీయ విద్యా విధానాన్ని రూపొందిస్తున్నట్టు ఏజీసీటీఈ చీఫ్‌ కోఆర్డినేటింగ్‌ ఆఫీసర్‌ బుద్దా చంద్రశేఖర్‌ పేర్కొన్నారు.

భారత్‌ను విశ్వగురువుగా తీర్చిదిద్దే నూతన విద్యా విధానం
బుద్దా చంద్రశేఖర్‌

ఏజీసీటీఈ చీఫ్‌ కోఆర్డినేటింగ్‌ ఆఫీసర్‌ చంద్రశేఖర్‌

సింహాచలం, నవంబరు 29: భారత్‌ను విశ్వ గురువుగా తీర్చిదిద్దే నూతన జాతీయ విద్యా విధానాన్ని రూపొందిస్తున్నట్టు ఏజీసీటీఈ చీఫ్‌ కోఆర్డినేటింగ్‌ ఆఫీసర్‌ బుద్దా చంద్రశేఖర్‌ పేర్కొన్నారు. జిల్లా విశ్వహిందూ పరిషత్‌ సహాయ కార్యదర్శి పూడిపెద్ది శర్మతో కలిసి ఆదివారం ఆయన సింహాద్రి అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ జాతీయ విద్యావిధానం-2020 కింద సమూల మార్పులు తీసుకువస్తున్నామన్నారు. ఇందులో భాగంగా మనదేశానికి చెందిన ఉపాధ్యాయులు, నర్సులు, వివిధ రంగాలకు చెందిన కార్మికులను నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దేందుకు అనుకూలమైన కోర్సుల రూపకల్పనకు, ఆధునిక సాంకేతికతను వినియోగించి పాఠ్యాంశాలను రూపొందిస్తున్నామన్నారు. 


Updated Date - 2020-11-30T04:54:40+05:30 IST