వయస్సు 14, గెలిచాడు 25 లక్షలు

ABN , First Publish Date - 2020-12-16T05:55:43+05:30 IST

కౌన్‌ బనేగా కరోడ్‌పతిలో డబ్బులు గెలుచుకోవడానికి చాలామంది పోటీపడతారు. కానీ కొంతమంది మాత్రమే సరైన సమాధానాలు చెప్పి డబ్బులు గెలుచుకుంటారు.

వయస్సు 14, గెలిచాడు 25 లక్షలు

కౌన్‌ బనేగా కరోడ్‌పతిలో డబ్బులు గెలుచుకోవడానికి చాలామంది పోటీపడతారు. కానీ కొంతమంది మాత్రమే సరైన సమాధానాలు చెప్పి డబ్బులు గెలుచుకుంటారు. గుజరాత్‌కు చెందిన పద్నాలుగేళ్ల అన్‌మోల్‌ శాస్త్రి తన అద్భుతమైన ప్రతిభతో కేబీసీలో పాతిక లక్షలు గెలుచుకున్నాడు. 


 కౌన్‌ బనేగ్‌ కరోడ్‌పతి స్టూడెంట్స్‌ స్పెషల్‌ వీక్‌లో అన్‌మోల్‌ పాల్గొన్నాడు. అమితాబ్‌ బచ్చన్‌ అడిగిన ప్రశ్నలకు తడుముకోకుండా సమాధానాలు చెప్పి అందరిచేత శభాష్‌ అనిపించుకున్నాడు అన్‌మోల్‌. అతడి ప్రతిభను చూసి అమితాబ్‌ సైతం ముగ్దుడయ్యారు.


 50 లక్షల ప్రశ్నకు సరైన సమాధానం తెలియకపోవడంతో 25 లక్షలతో సరిపెట్టుకున్నాడు అన్‌మోల్‌. అప్పటికే లైఫ్‌లైన్‌లు పూర్తిగా ఉపయోగించుకోవడంతో ఆట నుంచి వైదొలిగి పాతిక లక్షలు గెలుచుకున్నాడు.


 పాతికలక్షలతో పాటు షోను స్పాన్సర్‌ చేస్తున్న సంస్థ నుంచి 5 లక్షల స్కాలర్‌షి్‌పను అందుకున్నాడా వండర్‌ కిడ్‌.

 

 ఈ కుర్రాడు నడుపుతున్న యూట్యూబ్‌ ఛానెల్‌ ‘హౌ ఇట్‌ వర్క్స్‌’ను ప్రమోట్‌ చేస్తానని హామీ ఇచ్చారు అమితాబ్‌. అన్‌మోల్‌ తన ఛానెల్‌లో ఫిజిక్స్‌, బయాలజీకి సంబంధించిన వీడియోలు అప్‌లోడ్‌ చేస్తుంటాడు.


 ఏపీజే అబ్దుల్‌కలాం, స్టీఫెన్‌ హాకింగ్‌లంటే ఇష్టం అంటున్న ఈ కుర్రాడికి ఖగోళ శాస్త్రవేత్త కావాలని ఉందట. అంతేకాకుండా నోబెల్‌ బహుమతి గెలుచుకోవాలని, ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా పేరొందాలని ఉందని తన మనసులో మాటను పంచుకున్నాడు అన్‌మోల్‌.

Updated Date - 2020-12-16T05:55:43+05:30 IST