గంజాయి విక్రయిస్తున్న నలుగురి అరెస్టు

ABN , First Publish Date - 2021-07-27T06:47:04+05:30 IST

విశాఖ జిల్లా ఏజెన్సీ నుంచి గంజాయి తీసుకొచ్చి తుని పరిసరాల్లో విక్రయాలు చేస్తున్న ముఠాను పట్టణ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు.

గంజాయి విక్రయిస్తున్న నలుగురి అరెస్టు

తుని, జూలై 26: విశాఖ జిల్లా ఏజెన్సీ నుంచి గంజాయి తీసుకొచ్చి తుని పరిసరాల్లో విక్రయాలు చేస్తున్న ముఠాను పట్టణ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌ బాబు ఆదేశాల మేరకు, పెద్దాపురం డీఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు సూచనలతో సోమవారం జాతీయ రహదారిపై వాహనాలు తనిఖీలు చే స్తుండగా పాయకరావుపేట మండలం రాజవరం గ్రామానికి చెందిన కాకాడ శ్రీను, తుని మం డలం అటికివానిపాలేనికి చెందిన గెడ్డం మురళీ మోటారుసైకిల్‌పై గంజాయి ప్యాకెట్లు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వారిని విచారించగా ఏజెన్సీనుంచి గంజాయి తీసుకొచ్చి తుని, పాయకరావుపేట పరిసరాల్లో యువకులకు అమ్ముతామని ఒప్పుకున్నారు. వీరితోపాటు రాజవరం గ్రామానికి చెందిన కాకాడ శివ, ఏడిద గోవిందులతో కలిసి సులభంగా డబ్బు సం పాదించాలనే ఉద్దేశంతో గంజాయి విక్రయించే వ్యాపారాన్ని ఎన్నుకున్నారు. వీరిపై కేసు నమో దు చేసి అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.8వేల విలువైన గంజాయి, రూ.30వేలు విలువ చేసే మోటారుసైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలో యువకులకు నిందితులను చూపించి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. సమావేశంలో ఎస్‌ఐలు శ్రీనివాస్‌, స్వామినాయుడు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-27T06:47:04+05:30 IST