అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచారం

ABN , First Publish Date - 2022-01-22T06:22:26+05:30 IST

వీఆర్‌ పురం మండలంలోని అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచరిస్తున్నట్టు వలస ఆదివాసీ గ్రామమైన సోడెపహడ్‌ గ్రామస్తులు గుర్తించినట్టు వీఆర్‌ పురం అటవీ శాఖ అధికారి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.

అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచారం

వరరామచంద్రాపురం, జనవరి 21 : వీఆర్‌ పురం మండలంలోని అటవీ  ప్రాంతంలో పెద్ద పులి సంచరిస్తున్నట్టు వలస ఆదివాసీ గ్రామమైన సోడెపహడ్‌ గ్రామస్తులు గుర్తించినట్టు వీఆర్‌ పురం అటవీ శాఖ అధికారి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. మండలంలోని సున్నవారిగూడెం, సోడెపహడ్‌ గ్రామాల పరిసర  అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచరిస్తుండగా సోడెపహడ్‌ ఆదివాసి గిరిజనులు చూశారని, వారి సమాచారం మేరకు అటవీ సిబ్బంది శుక్రవారం అటవీ ప్రాంతంలో పులికి సంబంధించిన గుర్తులను గుర్తించామన్నారు. ఆ ప్రాంతంలోకి ఎవరూ వెళ్లవద్దని, పశువులను మేత కోసం వెళ్లనివ్వద్దని రేంజర్‌ శ్రీనివాస్‌రెడ్డి సూచించారు.                         

Updated Date - 2022-01-22T06:22:26+05:30 IST