దూకుడు

ABN , First Publish Date - 2021-03-06T04:31:06+05:30 IST

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ఊపందుకున్నది..

దూకుడు

- సాధారణ ఎన్నికలను తలపిస్తున్న పట్టుభధ్రుల పోరు

- వ్యూహాలు, ఎత్తుగడలతో ముందుకు సాగుతున్న అభ్యర్థులు

- ‘పన్నా’ విధానాన్ని అవలంభిస్తున్న ప్రధాన పార్టీలు

- రంగంలోకి దిగిన ముఖ్య నాయకులు

- గ్రాడ్యుయేట్స్‌ను నేరుగా కలుస్తూ ఓట్ల కోసం అభ్యర్థన

- ఆకట్టుకునేలా ప్రకటనలు, ప్రసంగాలతో వల


(మహబూబ్‌నగర్‌-ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ఊపందుకున్నది.. సాధారణ ఎన్నికల మాదిరిగా, ఈ ఎన్నికల్లో ఓటర్లను నేరుగా కలుస్తూ, ప్రధాన పార్టీలు కొత్త వ్యూహాలకు తెరలేపాయి.. ఓట్లను అభ్యర్థించడంతో పాటు వారి మనోభావాలను, పార్టీలపై వారికున్న వైఖరిని తెలుసుకుంటున్నాయి.. అందుకు తగ్గట్లు ప్రచారంలో ప్రసంగాలు, ప్రకటనలు చేస్తున్నాయి.. దీనికితోడు మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ నియోజకవర్గంలో ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి మొదటి ప్రాధాన్యత ఓట్లను అధికంగా సాధించాలనే లక్ష్యంతో పార్టీలు, అభ్యర్థులు సూక్ష్మ స్థాయి ప్రణాళికలు అమలు చేస్తున్నారు..

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతి ఓటును పార్టీలు కీల కంగా భావిస్తున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి అ త్యధికంగా మొదటి ప్రాధాన్యత ఓట్లు రాబట్టేలా బీజేపీ, టీఆర్‌ ఎస్‌, కాంగ్రెస్‌, టీడీపీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. బీజేపీలో సంప్రదాయంగా వస్తున్న పన్నా ఇన్‌చార్జి వ్యవస్థను కొనసాగిస్తూ, ప్రతి 20 మంది ఓటర్లకు ఒక ఇన్‌చార్జిని నియమించింది. ఇందుకు దీటుగా ప్రతి 50 మంది ఓటర్లకు ఒక ఇన్‌చార్జితో టీఆర్‌ఎస్‌, ప్రతి పోలింగ్‌ బూత్‌కు ఒక ఇన్‌చార్జితో కాంగ్రెస్‌ ప్రచారం సాగిస్తోంది. వీరితో పాటు ప్రతి పో లింగ్‌ కేంద్రానికి, ప్రతి మండలానికి, నియోజకవర్గానికి ప్రత్యేక పరిశీలకులను ఆ పార్టీలు నియమించాయి. క్షేత్ర స్థాయి ఇన్‌చార్జీలు ప్రతి రోజూ ఓటర్లను కలుస్తున్నారు. వారితో మాట్లాడుతూ, వారి మనోగతాన్ని, పార్టీ పట్ల ఉన్న వారి వై ఖరిని తెలుసుకుంటున్నారు. ఆ వివరాలను బూత్‌ , మండల ఇన్‌చార్జీలకు తెలియజేస్తున్నారు. దాని ప్రకారం నియోజ కవర్గ పరిశీలకులు పార్టీకి ఫీడ్‌ బ్యాక్‌ పంపిస్తున్నారు. వీరి నివేదికల ఆధారంగా ఎప్పటికప్పుడు ప్రచార వ్యూహాన్ని మారుస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకునేలా నాయకుల ప్రకటనలు, ప్రసంగాలు రూపొందిస్తున్నారు. సోషల్‌ మీడియా లో కూడా ప్రచారం చేస్తున్నారు. ఓటర్లు ఆశ్చర్యపోయే రీతిలో వారికి మెసేజ్‌లు, ఫోన్లు చేస్తున్నారు.

ఈ ప్రచారంలో ఒకడుగు ముందుకేసిన టీఆర్‌ఎస్‌ ఓటర్లలో సానుకూల, మధ్యస్థ, వ్యతిరేక ఓటర్లను గుర్తించి, వారిని తమవైపు తిప్పుకునేలా కార్యాచరణను కొనసాగిస్తోంది. ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా ఓటర్లు కేంద్రీకృతమైన మహబూబ్‌నగర్‌ జిల్లాలో పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ స్వయంగా రంగంలోకి దిగారు. జిల్లా కేంద్రంలోని ఉపాధ్యాయులు, మేధావులు, పట్టభద్రులు, ఉద్యోగులను ఆయా సంఘాల వారీగా, వర్గాల వారీగా సమావేశా లు నిర్వహిస్తూ, వారితో అనుసంధానమవుతున్నారు. ప్రతి ఓటరును మంత్రే స్వయంగా కలుస్తూ, ఓట్లు అభ్యర్థిస్తున్నారు.

కాంగ్రెస్‌ నాయకులు కూడా స్వచ్ఛందంగా బూత్‌ స్థాయిలో ఓటర్లను కలుస్తూ, ఆ పార్టీ అభ్యర్థి గెలుపు ఆవశ్యకతను వి వరిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత నుంచి స్తబ్ధుగా ఉన్న ఆ పార్టీ శ్రేణులు, ఈ ఎన్నికలో యాక్టివ్‌గా క నిపిస్తున్నారు. అభ్యర్థి చిన్నారెడ్డి కోసం క్షేత్రస్థా యి క్యాడర్‌ సీరియస్‌గా పని చేస్తున్న పరిస్థితి, మారిన పార్టీ శ్రేణుల విధానాన్ని తెలియజే స్తోంది. మొత్తంగా బహుముఖ వ్యూహంతో సాగుతున్న ఈ ప్రచా రంలో, చివరకు గ్రాడ్యుయేట్లు ఎవరిని ఆద రిస్తారో వేచి చూడాలి.


ఊపందుకున్న ప్రచారం

- టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వాణీదేవి గెలుపే లక్ష్యంగా ఆ పార్టీ ప్రత్యే క పరిశీలకుడిగా ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డిని నియమించగా, ఆయనతో పాటు మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీని వాస్‌గౌడ్‌ ప్రచార బాధ్యతలు అప్పగించారు. వారు ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకుంటూ అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి స మావేశాలు, పట్టభద్రుల సంఘాలు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కుల సంఘాల  సమావేశాల్లో పాల్గొంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు.

- బీజేపీ అభ్యర్థి ఎన్‌.రాంచందర్‌రావు గెలుపుని ప్రతిష్ఠాత్మకం గా తీసుకొన్న పార్టీ, కీలక నాయకులు ఉమ్మడి జిల్లాలో మొ హరించి ప్రచారం చేస్తున్నారు. పార్టీ అభ్యర్థితో పాటు జాతీయ ఉ పాధ్యక్షురాలు డీకే అరుణ, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, రాష్ట్ర ప్రఽ దాన కార్యదర్శి బంగారు శ్రుతి, రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్‌ ప్రచారంలో పాల్గొంటున్నారు.

- కాంగ్రెస్‌ అభ్యర్థిగా చిన్నారెడ్డిని ప్రకటించాక ఆయన క్లీన్‌ ఇమేజే ప్రచారాస్త్రంగా శ్రేణులు రంగంలోకి దిగారు. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డితో పాటు, ఏఐసీసీ కార్యదర్శులు వంశీచంద్‌ రెడ్డి, సంపత్‌కుమార్‌ అభ్యర్థితో పాటు ప్రచారం చేస్తున్నారు.

- టీడీపీ అభ్యర్థి ఎల్‌.రమణ తరుపున పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కొత్తకోట దయాకర్‌రెడ్డి, మోపతయ్య ప్రచారం చేస్తుం డగా, బీసీ సంఘాల నాయకులు కూడా ఈయన తరుపున ప్రచా రం సాగిస్తున్నారు. 

- స్వతంత్ర అభ్యర్థులు నాగేశ్వర్‌, హర్షవర్ధన్‌రెడ్డి నేరుగ సమ్మే ళనాలు నిర్వహిస్తున్నారు. నాగేశ్వర్‌కు మద్దతుగా వామపక్షాలు ప్రచారం చేస్తుండగా, హర్షవర్ధన్‌కు ఉపాధ్యాయ, నిరుద్యోగులు మద్దతుగా నిలుస్తున్నారు.

Updated Date - 2021-03-06T04:31:06+05:30 IST