దూకుడు

ABN , First Publish Date - 2022-06-21T07:26:42+05:30 IST

వచ్చే ఎన్నికలే లక్ష్యంగా అధికా ర, ప్రతిపక్ష పార్టీల నేతలు ముందుకుపోతున్నారు. గెలుపు గుర్రాల కోసం కాంగ్రెస్‌, బీజేపీ పార్టీల నేతలు దృష్టి పెట్టగా అధికార, సిట్టింగ్‌లో మరింత బలం పెంచుకునే పనిలో ఉన్నారు. ప్రభుత్వ పథకాల ను ప్రచారం చేస్తూనే నియోజకవర్గాల్లో ఇతర

దూకుడు

జిల్లాలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా రాజకీయ పార్టీల సందడి

గ్రామాల్లో జోరుగా అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల కార్యక్రమాలు

నియోజకవర్గాల్లోనే ఉంటూ పనులు చేపడుతున్న అధికారపార్టీ ప్రజాప్రతినిధులు

గెలుపు గుర్రాల కోసం కాంగ్రెస్‌, బీజేపీల వేట

జిల్లావ్యాప్తంగా రసవత్తరంగా మారిన రాజకీయాలు 

నిజామాబాద్‌, జూన్‌ 20(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): వచ్చే ఎన్నికలే లక్ష్యంగా అధికా ర, ప్రతిపక్ష పార్టీల నేతలు ముందుకుపోతున్నారు. గెలుపు గుర్రాల కోసం కాంగ్రెస్‌, బీజేపీ పార్టీల నేతలు దృష్టి పెట్టగా అధికార, సిట్టింగ్‌లో మరింత బలం పెంచుకునే పనిలో ఉన్నారు. ప్రభుత్వ పథకాల ను ప్రచారం చేస్తూనే నియోజకవర్గాల్లో ఇతర పార్టీల నేతలను మంత్రితో సహా ఎమ్మెల్యేలు, ఎమ్మె ల్సీలు పార్టీలోకి తీసుకుంటున్నారు. సర్వేలే ప్రాతిపదికన సీఎం కేసీఆర్‌ టికెట్‌ కేటాయించడనుండడంతో ప్రజల్లో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిపక్ష కాంగ్రెస్‌, బీజేపీ పార్టీ నేతలు ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో పాగా వేసేందుకు గెలి చే అభ్యర్థుల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇతర పార్టీ ల నుంచేకాకుండా తటస్తులు, ఎన్‌ఆర్‌ఐలు, వ్యాపారవేత్తలపైన దృష్టిపెట్టి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. నియోజకవర్గాల్లో సామాజిక వర్గాల ఓటర్ల సంఖ్యను బట్టి అభ్యర్థులను బరిలో దించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పార్టీలే కాకుండా ఇతర పార్టీల నేతలు కూడా ఓట్లు తెచ్చే నేతల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇంకా ఏడాది సమయం ఉన్నా..

వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సంవత్సరానికి పైగా సమయం ఉంది. అయినా అన్ని పార్టీల నేతలు జిల్లాపైనే దృష్టిపెట్టి పనిచేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తమ పట్టు నిలుపుకునేందుకు సిద్ధమవుతున్నారు. అధికార, సిట్టింగ్‌లు తమ ప్రాబల్యాన్ని కోల్పోకుండా ఉండేందుకు భారీగా నిధులను తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నియోజకవర్గాల్లో పనులు చేపట్టడంతో పాటు సంక్షేమ పథకాలు అందేవిధంగా చూస్తున్నారు. చెక్‌డ్యాంలు, రోడ్ల నిర్మాణం, ఎత్తిపోతల పథకాలకు అనుమతులు తీసుకోవడంతో పాటు జీవోలు జారీ చేయడం, అభివృద్ధి పనులకు శంకుస్థాపన లు చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌ మొద టి, రెండో దఫా ఎన్నికల్లో ఎమ్మెల్యేలకు అవకాశం ఇచ్చినా.. మూడో దఫా గెలు పు గుర్రాలకే అవకాశం ఇవ్వనుండడంతో నియోజకవర్గంలో తమకు ఎదురులేకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రశాంత్‌ కిషోర్‌ సర్వేల ఆధారం గా సీట్లను కేటాయించనుండడంతో సిట్టింగ్‌లు అంతా జిల్లాలోనే ఎక్కువ రోజు లు ఉంటున్నారు. మరింత అభివృద్ధి పనులు పూర్తిచేసేందుకు చర్యలు చేపడుతున్నారు. పెండింగ్‌ పనులను పూర్తి చేస్తున్నారు. మంత్రి ప్రశాంత్‌రెడ్డి నియోజకవర్గంలో భారీగా అభివృద్ధి పనులను చేస్తున్నారు. వంద పడకల ఆసుపత్రి, మోతె ఆసుపత్రులకు శంకుస్థాపనలు చేశారు. సుమారు రూ.60 కోట్లతో చెక్‌డ్యాంలను కొత్తగా తీసుకువచ్చారు. నియోజకవర్గంలో రోడ్లను పూర్తిచేశారు. భారీగా ఇతర పార్టీల వారిని చేర్చుకుంటూ ముందుకుపోతున్నారు. ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ నియోజకవర్గంలో పనులన్నీ పూర్తిచేస్తున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండడంతో పాటు కొత్త పథకాలను తీసుకువచ్చి అమలుకు ప్రయత్నం చేస్తున్నారు. ఆయన లేని సమయంలో కొడుకు బాజిరెడ్డి జగన్‌ అందుబాటులో ఉండి ప నులు చేస్తున్నారు. నిజామాబాద్‌ అర్బన్‌, బోధన్‌, ఆర్మూర్‌ ఎమ్మెల్యేలు బిగాల గణేష్‌గుప్త, షకీల్‌ అమీర్‌, జీవన్‌రెడ్డిలు తమ నియోజకవర్గా ల్లో కలియతిరుగుతున్నారు. పలు అభివృద్ధి పనులను పూర్తిచేస్తున్నారు. కొత్తవి తీసుకవచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. తమకు అనుకూలమైన వారిని చేర్చుకుంటునే నియోజకవర్గాల్లో తమకన్న మించిన వారు లేకుండా చూసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో వారే పోటీ చేసేందుకు ఏర్పాట్లను చేసుకుంటున్నారు. బాన్సూవాడ నియోజకవర్గం పరిధిలో స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి నియోజకవర్గ ప్రజలకు పూర్తిగా అందుబాటులో ఉంటున్నారు. యువ ఎమ్మెల్యేలకు దీటుగా పర్యటిస్తూ పలు పనులు చేస్తున్నారు. మంజీరా మీద చెక్‌డ్యాంలను తీసుకురావడంతో పాటు వర్ని, చందూర్‌,  మోస్రా మండలాల్లో ఎత్తిపోతల పథకాలను మంజూరు చేయించారు. పలు పథకాలకు శంకుస్థాపనలు చేశారు. ఆయన లేని సమయంలో ఇద్దరు కొడుకులు సురేందర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డిలు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి పనులు నిర్వర్తిస్తున్నారు. ఎమ్మెల్సీ కవిత సైతం మరింత బలోపేతానికి కృషి చేస్తున్నారు. కావాల్సిన నిధులు మం జూరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. అవసరమైన గ్రామాలకు నిధులు విడుదల చేయిస్తున్నారు. పార్టీ నేతలకు అందుబాటులో ఉంటూ పనులు చేస్తున్నారు. క్యాడర్‌కు మనోధైర్యం ఇవ్వడంతో పాటు పలు పనులు పూర్తిచేస్తున్నారు.  

గెలుపు గుర్రాల కోసం వెతుకులాట

జిల్లాలో ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్‌ నేతలు గెలుపుగుర్రాల కోసం ప్రయత్నా లు చేస్తున్నారు. తమదైన శైలిలో కార్యక్రమాలు నిర్వర్తిస్తూనే ప్రజలకు దగ్గర య్యే ప్రయత్నాలు చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా పరిధిలోని ఆరు నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌కు పోటీ ఇచ్చినా.. ఒక్క సీటును కూడా గెలుచుకోలేదు. గతంలో జిల్లా నుంచి ప్రాతినిథ్యం ఉన్నా.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్‌కు అవకాశం రాలేదు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా ప్రాతినిథ్యం చూపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నియోజకవర్గాల్లో ఇన్‌చార్జిలతో కార్యక్రమాలు నిర్వర్తిస్తూనే.. గెలుపు గుర్రాల కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. గత ఎన్నికల్లో నిజామాబాద్‌ అర్బన్‌ నుంచి తాహెర్‌బిన్‌ హుందాన్‌, రూరల్‌ నుంచి డాక్టర్‌ భూపతిరెడ్డి, ఆర్మూర్‌ నుంచి ఆకుల లలి త, బాల్కొండ నుంచి మాజీ విప్‌ ఈర వత్రి అనిల్‌, బోధన్‌ నుంచి మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి, బాన్సూవాడ నుంచి కాసుల బాల్‌రాజ్‌లు పోటీ చేశారు. వీరిలో ఆకుల లలిత టీఆర్‌ఎస్‌లో చేరగా.. మిగతా వారు పార్టీలో ఉండి నియోజకవర్గ ఇన్‌చార్జిలుగా కొనసాగుతున్నారు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి ఎన్నికైన తర్వాత జిల్లా పార్టీలో ఊపు వచ్చింది. పీసీసీలో ప్రధాన పోస్టులలో జిల్లాకు చెందిన వారు చేరారు. పార్టీ కోశాధికారిగా మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేష్‌కుమార్‌గౌడ్‌, ప్రచార కమిటీ చైర్మన్‌గా మధుయాష్కీగౌడ్‌లను నియమించారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా కొన్ని స్థానాలు గెలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గెలిచేవారికి టికెట్‌లు ఇచ్చే అవకాశం ఉండ డంతో ప్రస్తుతం ఉన్న నేతలే ఎక్కువగా తిరుగుతున్నారు. తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. వీరితో పాటు మరికొంతమంది ప్రయత్నాలు చేస్తున్నా రు. ఈ దఫా గెలిచే వారికే అవకాశం ఉండడంతో పార్టీ చేసే సర్వేల ఆదారంగా టికెట్‌లు కేటాయించే అవకాశం ఉండడంతో ఎవరికి వారే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇతర పార్టీల వారిని కూడా కొంతమందిని చేర్చుకుని టికెట్‌ ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటి నుంచే తటస్తులను, ఇతర పార్టీల్లో పలుకుబడి ఉన్న నేతలతో చర్చలు జరుపుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రాతినిథ్యం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ దఫా కమలం గట్టి పోటీ

బీజేపీ పార్టీ నేతలు ఈ దఫా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏ నియోజకవర్గంలోని భారీగా ఓట్లు రాలేదు. పార్లమెంట్‌లో మాత్రం ఎంపీ సీట్‌ను గెలుచుకున్నారు. ఆ ఊపుతో ఉన్న పార్టీ నేతలు వచ్చే ఎన్నికల్లో కొన్ని సీట్లు అయినా సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న నేతలైతే కాకుండా సర్వేల ఆధారంగా బలమైన నేతలను గుర్తించి పార్టీలోకి ఆహ్వానించడంతో పాటు గెలిచే అవకాశం ఉన్న నేతలకు టికెట్‌ ఇచ్చే ప్రయత్నా లు చేస్తున్నారు. ఎన్‌ఆర్‌ఐలతో పాటు ఇతర పార్టీల నేతలతో టచ్‌లో ఉంటున్నా రు. ఎవరికి వారే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వడంతో పాటు రాష్ట్రంలో ఎక్కువ సీట్లను తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నా.. కేంద్ర నాయకత్వం పార్లమెంట్‌ సీటు ఉన్న జిల్లాపై నజర్‌పెట్టి ఎలాగైనా పాగా వేసేందుకు ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నారు. పార్లమెంట్‌ సభ్యుడిగా ఉన్న అర్వింద్‌ ఆధ్వర్యంలో ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. పార్టీలో నియోజకవర్గ ఇన్‌చార్జిలుగా నిజామాబాద్‌ అర్బన్‌ ధన్‌పాల్‌ సూర్యనారాయణ, బోధన్‌ మేడపాటి ప్రకాష్‌రెడ్డి, బాన్సూవాడ మల్యాద్రిరెడ్డి, బాల్కొండ మల్లికార్జున్‌రెడ్డి, ఆర్మూర్‌ వినయ్‌రెడ్డి, నిజామాబాద్‌ రూరల్‌ దినేష్‌లు ప్రస్తుతం కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మినారాయణ, ఇతర నేతలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. పార్టీ కేంద్ర, రాష్ట్ర నేతల ఆదేశాలకు అనుగుణంగా పనులు చేస్తున్నారు. ఎంపీ ఉండడం వల్ల మరింత బలోపేతం చేసుకునేందుకు కేంద్ర మంత్రులతో పాటు ఇతర నేతల పర్యటనలు జిల్లాలో జరిగేవిధంగా చూస్తున్నారు. గత ఎన్నికల్లో పోటీపడ్డ ఎక్కువగా ఓట్లు రాకపోయినందు న ఈ దఫా ఎలాగైనా గెలిచేవారికి సీట్లు ఇవ్వనున్నారు.  

ఇతర పార్టీల నేతల ప్రయత్నాలు

వచ్చే ఎన్నికల్లో ఇతర పార్టీల నేతలు కూడా తమ ఉనికిని కాపాడుకునేందు కు ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లా నుంచి అన్ని స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలో దించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. బీఎస్‌పీ, ఆమ్‌ఆద్మీ, వైఎస్‌ఆర్‌టీపీ, వామపక్ష, సీపీఐ, సీపీఎంతో పాటు ఇతర పార్టీలు కూడా పోటీలో నిలవనున్నారు. తమ పార్టీల తరపున నియోజకవర్గాల్లో అభ్యర్థులను దింపేందుకు ఇప్ప టి నుంచే ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాలో కార్యక్రమాలు చేపడుతున్నారు. అన్ని పార్టీలు సర్వేలు కొనసాగిస్తున్నందున వచ్చే ఎన్నికలు రసవత్తరంగా మా రనున్నాయి. సామాజిక వర్గాల ఆధారంగానే సీట్లు ఇచ్చే అవకాశం ఉండడంతో ఇప్పటి నుంచే ఆశలు పెట్టుకున్న వారికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. మొత్తంగా జిల్లాలో ప్రస్తుతం అన్నిపార్టీల నేతలు పర్యటిస్తుండడంతో రాజకీయ చర్చలు కొనసాగుతున్నాయి. ప్రజలు మాత్రం అందరు చెప్పే విషయాలు వింటూ తమ పనుల్లో నిమగ్నం అవుతున్నారు. ఎవరు ఏ పార్టీకి మద్దతు ఇస్తారో ఎన్నికల సమయంలోనే తేలే అవకాశం ఉంది. 

Updated Date - 2022-06-21T07:26:42+05:30 IST