కొఠియాపై ఒడిశా దూకుడు

Published: Thu, 04 Aug 2022 22:38:14 ISTfb-iconwhatsapp-icontwitter-icon
కొఠియాపై ఒడిశా దూకుడు నేరేళ్లవలస, దొరలతాడివలస మధ్య ఒడిశా ఏర్పాటు చేసిన బోర్డు

కొరాపుట్‌ వారసత్వం పేరిట బోర్డు

సాలూరు రూరల్‌, ఆగస్టు 4: కొఠియా గ్రూపు గ్రామాలపై పట్టుకు ఒడిశా మరో అడుగు ముందుకు వేసింది. కొరాపుట్‌ హేరిటేజ్‌ (కొరాపుట్‌ వారసత్వం) పేరిట నేరేళ్లవలస, దొరల తాడివలస గ్రామాల మధ్య గురువారం సాయంత్రం ప్రత్యేక బోర్డు ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఒడిశా అధికారులు చేసిన హడావుడి అంతాఇంతా కాదు.  నేరేళ్లవలస నుంచి కొఠియా గ్రూపు గ్రామాలైన దొరలతాడివలస, కుంబిమడల మీదుగా టర్నర్‌ ఘాట్‌లో పొట్టంగి వరకూ ఒడిశా ప్రభుత్వం రూ.15.62 కోట్లతో తారురోడ్డు నిర్మించింది. ఏపీ మైదాన ప్రాంతాల్లో మీదుగా ఈ రోడ్డు ఉంది. దీనిని గతంలో బ్రిటీష్‌ రోడ్డుగా వ్యవహరించేవారు. ఈ రోడ్డు గుండా ఎడ్ల బళ్లతో ఒడిశాకు ఏపీ నుంచి సరుకు రవాణా జరిగేది. బ్రిటీష్‌ హయాంలో జరిగిన ఈ రవాణాను ఉటంకిస్తు రోడ్డు నిర్మాణం చేశామని.. ఇది కొరాపుట్‌ (ఒడిశా) వారసత్వమంటూ బోర్డు ఏర్పాటు చేయడం విశేషం. కొఠియాపై గత కొద్దిరోజులుగా ఒడిశా దూకుడుగా వ్యవహరిస్తూనే ఉంది.  


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.