డ్రగ్స్‌ కేసులో తమ్ముడి అరెస్ట్‌

Sep 26 2021 @ 01:22AM

హిందీ నటుడు అర్జున్‌ రాంపాల్‌ గాళ్‌ఫెండ్ర్‌ గబ్రియెలా తమ్ముడు అజిసిలోష్‌ను శుక్రవారం నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు గోవా పోలీసులు అరెస్ట్‌ చేశారు. డ్రగ్‌ పెడ్లర్స్‌ కోసం సాగించిన అన్వేషణలో అతను చిక్కాడు. కోర్టు రెండు వారాలు జ్యుడిషియల్‌ కస్టడీ విధించినట్టు సమాచారం. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ డ్రగ్స్‌ కేసులో గతేడాది అక్టోబర్‌లో తొలిసారి, ఆ తర్వాత నైజీరియన్‌ కొకైన్‌ కేసులో రెండోసారి, ఇప్పుడు గోవాలో మూడోసారి అజిసిలోష్‌ అరెస్ట్‌ కావడం గమనార్హం. గతేడాది అర్జున్‌ రాంపాల్‌, గబ్రియెలాకూ పోలీసులు సమన్లు జారీ చేసి విచారించారు. తెలుగులో ‘ఊపిరి’ చిత్రంలో జెన్నీ పాత్రలో గబ్రియెలా నటించారు.

Follow Us on:

Bollywoodమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.