నాడు బ్రిటిష్‌పై, నేడు వైసీపీపై పోరాటం

ABN , First Publish Date - 2022-08-15T05:24:24+05:30 IST

నాడు స్వాతంత్య్రం కోసం బ్రిటిష్‌ పాలకులకు వ్యతిరేకంగా ఉద్యమించి విజయం సాధించిన మనం నేడు వైసీపీ దురాగతాలపై పోరాటాడాల్సిన దుస్థితి ఏర్పడిందని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు.

నాడు బ్రిటిష్‌పై, నేడు వైసీపీపై పోరాటం
బైక్‌ ర్యాలీలో మాజీ మంత్రి సోమిరెడ్డి, నాయకులు, కార్యకర్తలు

 జిల్లాలో 145 మంది జైలుకెళ్లారు

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో సోమిరెడ్డి

పొదలకూరు, ఆగస్టు 14 : నాడు స్వాతంత్య్రం కోసం బ్రిటిష్‌ పాలకులకు వ్యతిరేకంగా ఉద్యమించి విజయం సాధించిన మనం నేడు వైసీపీ దురాగతాలపై పోరాటాడాల్సిన దుస్థితి ఏర్పడిందని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ఆదివారం టీడీపీ ఆధ్వర్యాన స్థానిక సంగం రోడ్డు కూడలి నుంచి ప్రధాన రహదారిపై రామ్‌నగర్‌ వరకు బైక్‌ ర్యాలీ జరిగింది. ర్యాలీలో సోమిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దళితులను ఇబ్బందులు పట్టే వైసీపీ నాయకులకు, పోలీసులకు ఉదయగిరి నారాయణ సంఘటన గుణపాఠం నేర్పిందన్నారు. టీడీపీ పోరాటం వల్లే నారాయణ కుటుంబానికి న్యాయం జరిగిందన్నారు. స్వాతంత్య్రం కోసం జిల్లాలో 145 మంది  జైలుకెళ్లారని అన్నారు. బెజవాడ గోపాల్‌రెడ్డి, వెన్నెలకంటి రాఘవయ్య, పొణకా కనకమ్మ, బద్దెపూడి వెంకటనారాయణరెడ్డి, గండవరపు హనుమరెడ్డి, సోమిరెడ్డి ఆదినారాయణరెడ్డి, ఓరుగల్లు వెంకటసుబ్బయ్య తదితరులు జైలుకెళ్లారని  గుర్తు చేశారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు తలచీరు మస్తాన్‌బాబు, పట్టణ అధ్యక్షుడు బొద్దులూరు మల్లికార్జుననాయుడు, వెన్నపూస రాజశేఖర్‌రెడ్డి, కోడూరు భాస్కర్‌రెడ్డి, రాజా యాదవ్‌, బొమ్మి సురేంద్ర, సందీప్‌, మురళి, వెంకటాచలం, తోటపల్లి మండలాధ్యక్షులు గుమ్మడి రాజాయాదవ్‌, సురేష్‌రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

రాష్ట్రంలో అప్పులు తప్ప... అభివృద్ధి శూన్యం

రాష్ట్రంలో అప్పులు తప్ప.. అభివృద్ధి శూన్యమని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి  విమర్శించారు. ఆదివారం మండలంలోని మహమ్మదాపురం గ్రామంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ‘బాదుడే బాదుడు’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి ఇంటికి తిరిగి కరపత్రాలు పంచారు. ఈ మూడేళ్లలో వైసీపీ పాలనలో పెరిగిన ధరలు, జగన్‌ అరాచకాలను వివరించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు సుధాకర్‌రెడ్డి, దయాకర్‌రెడ్డి, శివారెడ్డి, పర్చురు రవి, ఎండీ ఇర్ఫాద్‌, జనార్ధన్‌రెడ్డి, పెనమల్లి చంద్రశేఖర్‌, దొడ్ల హరి, వెంకటేశ్వర్లు, అక్బర్‌, కృష్ణయ్య, శీనువాసులు, పొదలకూరు, తోటపల్లిగూడూరు మండలాధ్యక్షుడు మస్తాన్‌బాబు, సురేష్‌రెడ్డి, కోడూరు భాస్కర్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, బక్కయ్యనాయుడు, వెంకటరత్నంనాయుడు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-15T05:24:24+05:30 IST