దేశభద్రతకు ప్రమాదకరంగా ‘అగ్నిపథ్‌’

ABN , First Publish Date - 2022-06-28T05:29:10+05:30 IST

దేశభద్రతకు ప్రమాదకరంగా ‘అగ్నిపథ్‌’

దేశభద్రతకు ప్రమాదకరంగా ‘అగ్నిపథ్‌’
ఇబ్రహీంపట్నం: సత్యాగ్రహ దీక్షలో మాట్లాడుతున్న మల్‌రెడ్డి రంగారెడ్డి

  • ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్‌రెడ్డి 
  • జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్షలు 
  • పెద్దఎత్తున తరలి వచ్చిన నాయకులు, కార్యకర్తలు 


ఆమనగల్లు, జూన్‌ 27: అగ్నిఫథ్‌ పథకం దేశ భద్రతకు ప్రమాదకరమని ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్‌రెడ్డి అన్నారు. ఆమనగల్లు పట్టణంలో సోమవారం కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. దీక్షకు కల్వకుర్తి నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చారు. ఆమనగల్లు పట్టణంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ బైక్‌ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని హైదరాబాద్‌-శ్రీశైలం జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన సత్యాగ్రహ దీక్షకు మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు మండ్లీ రాములు అధ్యక్షత వహించారు. దీక్షకు ముఖ్య అతిథిగా హాజరై మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్‌రెడ్డి మాట్లాడుతూ..  దేశాన్ని విచ్చిన్నం చేయడానికి మోదీ సర్కార్‌ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అగ్నిపథ్‌ పథకాన్ని వెంటనే రద్దు చేయాలన్నారు. ఈకార్యక్రమంలో పీసీసీ సభ్యుడు ఆయిళ్ల శ్రీనివా్‌సగౌడ్‌, డీసీసీ అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివా్‌సరెడ్డి, మండ్లీ రాములు, యాట నర్సింహ, గుజ్జల మహేశ్‌, భట్టు కిషన్‌రెడ్డి, మోతిలాల్‌, బీక్యనాయక్‌, విజయ్‌కుమార్‌రెడ్డి,  శ్రీపాతి శ్రీనివా్‌సరెడ్డి, రవికాంత్‌ గౌడ్‌, అనిల్‌గౌడ్‌ పాల్గొన్నారు.

ఆందోళనలు తీవ్రతరం చేస్తాం: మల్‌రెడ్డి రంగారెడ్డి 

ఇబ్రహీంపట్నం: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అగ్నిపథ్‌ను రద్దు చేయకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి హెచ్చరించారు. ఇబ్రహీంపట్నంలో చేపట్టిన సత్యాగ్రహ దీక్షలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని  మాట్లాడారు. దేశానికి సేవ చేద్దామనే ఉద్దేశ్యంతో సైన్యంలో పనిచేద్దామంటే కేంద్రప్రభుత్వం కేవలం నాలుగు సంవత్సరాలకే ఉద్యోగాలను పరిమితం చేయడమేంటని ప్రశ్నించారు. ఏడాదికి కోటి ఉద్యోగాలిస్తామని నమ్మబలికి అధికారంలోకి వచ్చిన బీజేపీ యువతను మోసం చేస్తోందని విమర్శించారు. జడ్పీటీసీ మహిపాల్‌ అధ్యక్షతన జరిగిన ఈ దీక్షలో నాయకులు చిలుక మధుసూదన్‌రెడ్డి, గురునాథ్‌రెడ్డి, పాండురంగారెడ్డి, రాచర్ల వెంకటేశ్వర్లు, జయమ్మ, జ్యోతి ఉన్నారు.  

‘అగ్నిపథ్‌’ను రద్దు చేయాలి

చేవెళ్ల: అగ్నిపథ్‌ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని కాంగ్రెస్‌ పార్టీ చేవెళ్ల నియోజకవర్గం సీనియర్‌ నాయకుడు సున్నపు వసంతం డిమాండ్‌ చేశారు. చేవెళ్ల నియోజకవర్గం స్థాయి కాంగ్రెస్‌ పార్టీ నాయకులతో కలిసి సోమవారం చేవెళ్ల పట్టణ కేంద్రంలో సత్యాగ్రహ దీక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సున్నపు సంతం మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఒంటెద్దు పోకడలకు పోతూ దేశప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షుడు జనార్దన్‌రెడ్డి, కార్యదర్శి ఉదయ్‌మోహన్‌రెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్‌ చాంబర్స్‌ అధ్యక్షుడు చింపుల సత్యనారాయణరెడ్డి, భీమ్‌భారత్‌, శ్రీనివా్‌సగౌడ్‌, రాజుగౌడ్‌, భార్గవ్‌రామ్‌, యాలాల మహేశ్వర్‌రెడ్డి, చేవెళ్ల, వీరేందర్‌రెడ్డి, వెంకటయ్య, పెంటారెడ్డి, మద్దెల శ్రీనివాస్‌, శభ్బిర్‌, శ్రీనివా్‌సగౌడ్‌, రాములు, సామా రవీందర్‌రెడ్డి, ఇక్బాల్‌, పాండు ఉన్నారు. 

ఆందోళనకరంగా దేశ భద్రత : వీర్లపల్లి శంకర్‌ 

షాద్‌నగర్‌: దేశ భద్రత ఆందోళనకరంగా మారిందని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు వీర్లపల్లి శంకర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. షాద్‌నగర్‌లో సోమవారం సత్యాగ్రహ దీక్షలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశ భద్రతలో ఎంతో కీలకమైన మిలటరీ వ్యవస్థను ప్రయివేటు పరం చేసేందుకే కేంద్రం అగ్నిపథ్‌ పథకాన్ని ప్రవేశపెట్టిందని ఆరోపించారు. ఈ పథకాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఆయన వెంట నాయకులు కడెంపల్లి శ్రీనివాస్‌, బాబర్‌ఖాన్‌, కొంకళ్ల చెన్నయ్య గౌడ్‌, గడ్డం శ్రీనివాస్‌ యాదవ్‌, బాలరాజ్‌గౌడ్‌, చల్లా శ్రీకాంత్‌రెడ్డి, అందె మోహన్‌  తదితరులు ఉన్నారు.

Updated Date - 2022-06-28T05:29:10+05:30 IST