అగ్నిపథ్‌ అనాలోచిత పథకం

ABN , First Publish Date - 2022-06-28T06:49:55+05:30 IST

కేంద్రంలోని బీజేపీ అనాలోచితంగా అగ్నిపథ్‌ పథకాన్ని తీసుకొచ్చిందని, ఆర్మీలో చేరాలనుకున్న యువకుల కలలను నీరుగార్చిందని కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు నాగుల సత్యనారాయణ అన్నారు.

అగ్నిపథ్‌ అనాలోచిత పథకం
సిరిసిల్లలో సత్యాగ్రహ దీక్షలో జిల్లా, మండలాల నాయకులు

 - కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు నాగుల సత్యనారాయణ

- జిల్లా కేంద్రంలో సత్యాగ్రహ దీక్ష 

సిరిసిల్ల టౌన్‌, జూన్‌ 27: కేంద్రంలోని బీజేపీ అనాలోచితంగా అగ్నిపథ్‌ పథకాన్ని తీసుకొచ్చిందని, ఆర్మీలో చేరాలనుకున్న యువకుల కలలను నీరుగార్చిందని కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు నాగుల సత్యనారాయణ అన్నారు.  పార్టీ ఆధ్వర్యంలో సోమవారం అగ్నిపథ్‌ పథకాన్ని వ్యతిరేకిస్తూ సిరిసిల్ల పట్టణం అంబేద్కర్‌ చౌరస్తా వద్ద సత్యాగ్రహ దీక్షను చేపట్టారు. ముందుగా  కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు నాగుల సత్యనారాయణ, నాయకులు అంబేద్కర్‌ చౌరస్తాలోని అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడే సత్యాగ్రహ దీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్‌తో సాయుధ బలగాల పూర్వ సంప్రదాయాలు, నైతికతలను తారుమారు అవుతాయన్నారు.  అగ్నిపథ్‌ను వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా యువత  నిరసనలు తెలుపుతున్నా కేంద్ర ప్రభుత్వంలో చలనం లేదన్నారు.  జాతీయ కాంగ్రెస్‌ పార్టీ మొదటి నుంచి అగ్నిపథ్‌ను వ్యతిరేకిస్తోందని,  లోపాలను ఎప్పటికప్పుడు బహిర్గతం చేస్తోందని అన్నారు.  సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌ మాట్లాడుతూ అగ్నిపథ్‌ను కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.  ఏఐసీసీ, టీపీసీసీ ఆదేశాల మేరకు సిరిసిల్లలో సత్యాగ్రహ దీక్ష చేపట్టామన్నారు. కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్‌ పతకాన్ని రద్దు చేయకుంటే కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఆందోళనలను ఉధృతం చేస్తామన్నారు.  కాగా జిల్లా కేంద్రంలోని వివిధ మండలాల నుంచి కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో సత్యాగ్రహ దీక్ష విజయవంతమైంది.   కాంగ్రెస్‌ జిల్లా ఉపాధ్యక్షులు చొప్పదండి ప్రకాష్‌, బుర్ర రాములు, ఎండీ గౌస్‌, జిల్లా ప్రధాన కార్యదర్శులు లింగాల భూపతి, పి.శ్రీనివాస్‌, జి.ప్రశాంత్‌, ఆసని బాలరాజు, గిరిధర్‌రెడ్డి, సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి వెంగళ అశోక్‌, కార్యదర్శి కాసర్ల రాజు, సిరిసిల్ల బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు సూర దేవరాజు, ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు, పట్టణ అధ్యక్షుడు నక్క నర్సయ్య, కన్వీనర్‌ మంగ కిరణ్‌, ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య, ఎంపీటీసీ పర్శరాములు, సిరిసిల్ల నియోజవర్గం అధ్యక్షుడు చుక్క శేఖర్‌, నాయకులు బాలకిష్టయ్య, వంగ మల్లేశం, చిందం శ్రీనివాస్‌, రెడ్డిమల్ల భాను, పైస అంజనేయులు, బుర్ర మల్లేశం, అంజయ్యగౌడ్‌, భారత్‌గౌడ్‌, చోటు, జుబేర్‌, టి.రాజు, బాలరాజు, త్యాగరాజు, పంతం సురేష్‌, యాదయ్య పాల్గొన్నారు. 

ఇష్టారాజ్యంగా చట్టాలు  

వేములవాడ టౌన్‌ :  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టారాజ్యంగా చట్టాలను రూపొందిస్తున్నాయని,  యువత భవిష్యత్‌ను చీకటి మయం చేస్తున్నాయని   కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆది శ్రీనివాస్‌ అన్నారు. వేములవాడ మున్సిపల్‌ పరిధిలోని తిప్పాపూర్‌ ఆర్టీసీ బస్టాండ్‌ ఎదురుగా సోమవారం  ‘అగ్నిపథ్‌’ను రద్దు చేయాలని సత్యాగ్రహ దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  దేశ వ్యాప్తంగా నిరుద్యోగ సమస్య పెరిగిందని, ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో శాంతియుతంగా నిరసన తెలపడాకి వచ్చిన యువకులపై అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న తీరుతో సామాన్యులు  ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.  రాబోయే కాలంలో కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం చందుర్తి జడ్పీటీసీ, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు నాగం కుమార్‌ మాట్లాడుతూ దేశంలో బీజేపీ ప్రభుత్వంపైనా,  రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపైనా ప్రజలకు నమ్మకం పోయిందన్నారు. వారికి అనుకూలంగా చట్టాలను మార్చడంతో ప్రజల్లో  విఫలమయ్యారన్నారు.  కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు సాగరం వెంకటస్వామి, చందుర్తి జడ్పీటీసీ నాగం కుమార్‌, ఎంపీటీసీ మ్యాకల గణేష్‌, ఓబీసీ జిల్లా అధ్యక్షుడు ముడికే చంద్రశేఖర్‌యాదవ్‌, కాంగ్రెస్‌  జిల్లా ఉపాధ్యాక్షుడు సంఘస్వామి, మండల అధ్యక్షులు పిల్లి కనుకయ్య, వకులాభరణం శ్రీనివాస్‌, చింతపంటి రామస్వామి నాయకులు చిలుక రమేష్‌, కదిరే రాజుకుమార్‌, ఎర్రం ఆగయ్య, కనికరపు రాకేష్‌, కచ్చకాయల ఎల్లయ్య, చంద్రగిరి శ్రీనివాస్‌, చిలువేరి శ్రీనివాస్‌, బొజ్జ భారతి, పాత సత్యలక్ష్మి, తోట లహరి, గొట్టె రుక్మిణి, కత్తి కనుకయ్య, నాగుల విష్ణు, నరేష్‌, శంకర్‌, అంజయ్య, శ్రీకాంత్‌, మహేష్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - 2022-06-28T06:49:55+05:30 IST