Taj Mahal:పర్యాటకులకు శుభవార్త... తాజ్‌మహల్‌లోకి ఉచిత ప్రవేశం

ABN , First Publish Date - 2022-08-04T13:14:37+05:30 IST

తాజ్(taj) పర్యాటకులకు(tourists) శుభవార్త....

Taj Mahal:పర్యాటకులకు శుభవార్త... తాజ్‌మహల్‌లోకి ఉచిత ప్రవేశం

ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకటన

ఆగ్రా (ఉత్తరప్రదేశ్): తాజ్(taj) పర్యాటకులకు(tourists) శుభవార్త. అమృత్ మహోత్సవ్ సందర్భంగా ఆగస్టు 5 నుంచి 15వతేదీ వరకు తాజ్‌మహల్‌లోకి(Taj Mahal) ఉచిత ప్రవేశం(free entry) కల్పిస్తున్నట్లు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(Archaeological Survey of India) ప్రకటించింది. ప్రపంచ వింతల్లో ఒకటైన పురాతన తాజ్‌మహల్‌లోకి ప్రవేశానికి విదేశీయులకు ఒక్కొక్కరికి 1300రూపాయలు, భారత పర్యాటకులకు 250రూపాయల చొప్పున ఎంట్రీ టికెట్ ఉండేది. తాజ్‌మహల్‌తో పాటు ఆగ్రా(Agra) నగరంలోని మిగిలిన అన్ని చారిత్రక కట్టడాలను ఉచితంగా చూడవచ్చని పురావస్తు శాఖ అధికారులు చెప్పారు. 


తాజ్‌మహల్‌ సందర్శించడానికి పర్యాటకులు పెద్దసంఖ్యలో రావడానికి ఉచిత ప్రవేశం దోహదపడుతుందని ఆగ్రా పర్యాటకుల సంక్షేమ ఛాంబర్ సెక్రటరీ విశాల్ శర్మ చెప్పారు. తాజ్ సందర్శకులకు కోతులు, కుక్కల బెడద అధికంగా ఉంది. దీంతోపాటు సందర్శకులు తాగేందుకు మంచినీరు కూడా అందుబాటులో లేదని, అమృత్ మహోత్సవ్ సందర్భంగా పర్యాటకుల సమస్యలను పరిష్కరించాలని శర్మ కోరారు. సందర్శకులను కోతులు(monkey), కుక్కలు(stray dogs) కరిచిన సందర్భాలున్నాయి. ఈ నేపథ్యంలో ఆగ్రా మున్సిపల్ అధికారులు తాజ్ వద్ద కుక్కలు, కోతుల బెడదను నివారించాలని పర్యాటకులు కోరుతున్నారు.


తాజ్ తూర్పు గేటు వద్ద వీధి కుక్కలు, ఆవులున్నాయని, అధికారులు వీటిని నివారించి, సందర్శకుల కోసం బ్యాటరీ వాహనాలను ఏర్పాటు చేయాలని సోషల్ యాక్టివిస్టు అమీర్ ఖురేషి సూచించారు.తాజ్ మహల్ కు సందర్శకుల వల్ల కోట్లాది రూపాయల ఆదాయం వస్తున్నందున, ఆ డబ్బును పర్యాటకుల సంక్షేమానికి వినియోగించాలని అమీర్ డిమాండ్ చేశారు. 


Updated Date - 2022-08-04T13:14:37+05:30 IST