ఆస్ట్రేలియాలో ప్రారంభమైన అగ్రజీత

Apr 23 2021 @ 00:23AM

ఓ మనిషి మరణానంతరం తన జ్ఞాపకాలను అణువు ద్వారా మరో మనిషిలోకి పంపే ఓ విభిన్న కథతో రూపుదిద్దుకొంటున్న చిత్రం ‘అగ్రజీత’. ఈ సినిమా షూటింగ్‌ ఆస్ట్రేలియా దేశంలోని డాండెనాంగ్‌ సిటీలోని శివ  విష్ణు ఆలయంలో ప్రారంభమైంది. రాహుల్‌ కృష్ణ, ప్రియాంక నోముల హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ మొత్తం ఆస్ట్రేలియాలోనే జరుగుతుంది. ఈ చిత్రం గురించి దర్శకుడు సందీప్‌రాజ్‌ మాట్లాడుతూ ‘ఓ విభిన్నమైన కథను గ్రాఫిక్‌ హంగులతో రూపొందిస్తున్నాం’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: సిద్దార్ఠ్‌ వాట్కిన్స్‌, కథ, కో డెరెక్టర్‌: కృష్ణారెడ్డి లోక, ఛాయాగ్రహణం, ఎడిటింగ్‌, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: సందీప్‌ రాజ్‌. నిర్మాణం: సందీప్‌రాజ్‌ ఫిల్మ్స్‌, వాసవి త్రివేది ప్రొడక్షన్స్‌.

Follow Us on:
Advertisement
 
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.