కాంగ్రెస్‌తోనే రైతురాజ్యం సాధ్యం

ABN , First Publish Date - 2022-05-24T05:46:38+05:30 IST

కాంగ్రెస్‌తోనే రైతురాజ్యం సాధ్యం

కాంగ్రెస్‌తోనే రైతురాజ్యం సాధ్యం
మంచాల: చిత్తాపూర్‌లో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి

ఆమనగల్లు/తలకొండపల్లి, మే 23: కాంగ్రె్‌సతోనే రైతు రాజ్యం సాద్యమని డీసీసీ ఉపాధ్యక్షుడు శ్రీపాతి శ్రీనివా్‌సరెడ్డి, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు మండ్లీ రాములు, యువజన కాంగ్రెస్‌ జిల్లా కార్యదర్శి కృష్ణనాయక్‌లు అన్నారు. ఆమనగల్లు మండలంలోని ఆకుతోటపల్లి, శెట్టిపల్లి గ్రామాల్లో సోమవారం కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఎనుముల రేవంత్‌రెడ్డి వరంగల్‌లో ప్రకటించిన రైతు డిక్లరేషన్‌ను గడపగడపకు తిరిగి ప్రజలకు వివరించారు. కాంగ్రెస్‌ రైతుడిక్లరేషన్‌కు రైతుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోందని శ్రీనివా్‌సరెడ్డి, రాములు అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌, యువజన కాంగ్రెస్‌ నాయకులు వస్పుల మానయ్య, వస్పుల శ్రీశైలం, రాఘవేందర్‌, రాజు, వస్పుల శ్రీకాంత్‌, మత్తయ్య, లక్ష్మయ్య, శెట్టిపల్లి శ్రీను, రామస్వామి పాల్గొన్నారు. తలకొండపల్లి మండలం వెంకటాపూర్‌, వెంకటాపూర్‌ తండాలో మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు గుజ్జల మహేశ్‌ ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. రైతు డిక్లరేషన్‌ కరపత్రాలను ఇంటింటికి పంపిణీ చేశారు. కార్యక్రమంలో పీసీసీ కిసాన్‌ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి మోహన్‌రెడ్డి, నాయకులు సాయిలు, గోపాల్‌, రాజు, శ్రీను, కుమార్‌, నర్సింహ పాల్గొన్నారు.  

కాంగ్రెస్‌ పాలనలో అన్ని వర్గాలకు భరోసా: వీర్లపల్లి శంకర్‌ 

షాద్‌నగర్‌రూరల్‌, మే 23: కాంగ్రెస్‌ పాలనలోనే రైతులతో పాటు అన్ని వర్గాలకు భరోసా కల్పిస్తున్నట్లు కాంగ్రెస్‌ పార్టీ షాద్‌నగర్‌ ఇన్‌చార్జి వీర్లపల్లి శంకర్‌ అన్నారు. ఫరూఖ్‌నగర్‌ మండలం హజీపల్లి గ్రామంలో సోమవారం రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన రైతు డిక్లరేషన్‌తో రూ.2లక్షల రుణమాఫీ ఒకేసారి చేస్తే జీవితాలు మారుతాయని దీమా వ్యక్తం చేశారు. పేదలకు నీడకల్పించి కడుపునిండా అన్నం పెట్టినది కాంగ్రెస్‌ మాత్రమేనని అన్నారు. పెరుగుతున్న ధరలవల్ల పేదప్రజలు బతకలేని పరిస్థితులు నెలకొన్నాయని విచారం వ్యక్తం చేశారు. రైతువ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను గద్దె దింపుదామని పిలుపునిచ్చారు. అంతకుముందు శంకర్‌కు హజీపల్లి ఉపసర్పంచ్‌ సింగారం సుదర్శన్‌ ఆధ్వర్యంలో డప్పులతో ఘనంగా స్వాగతం పలికి ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు బాబర్‌ఖాన్‌, బాల్‌రాజ్‌గౌడ్‌, చల్లా శ్రీకాంత్‌రెడ్డి, కృష్ణారెడ్డి, చెన్నయ్య, రాజగోపాల్‌, కొమ్ముకృష్ణ, ఎమ్మె సత్తయ్య, అంజీయాదవ్‌, స్వామి, హనుమంతు పాల్గొన్నారు. 

రైతును రాజును చేయడమే కాంగ్రెస్‌ సంకల్పం: మాజీ ఎమ్మెల్యే 

మంచాల, మే 23: రైతన్నలను రాజును చేయడమే కాంగ్రెస్‌ పార్టీ సంకల్పమని మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అన్నారు. మంచాల మండలంలోని చిత్తాపూర్‌, తాళ్లపల్లిగూడ, తిప్పాయిగూడ గ్రామాల్లో నిర్వహించిన కాంగ్రెస్‌ రచ్చబండ కార్యక్రమంలో ఆయన పాల్గొని రైతులతో ముచ్చటించి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. మొట్టమొదటి సంతకం రూ.2లక్షల పంటరుణాలు మాఫీ అన్నదాతలకు విముక్తి కల్పిస్తామని చెప్పారు. ఇంకా ఇందిరమ్మ రైతుభరోసా పథకాన్ని అమలులోకి తెచ్చి రైతులకు రూ.15వేల పంటసాయం అందజేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు వింజమూరి రాంరెడ్డి, సీహెచ్‌ సంజీవ, బాష, నూకం సుధాకర్‌, బుగ్గరాములు, ప్రేమాకర్‌రెడ్డి, జిలమోని సత్తయ్య, ఎడమ నరేందర్‌రెడ్డి, శ్రీధర్‌నాయక్‌, సంతో్‌షగౌడ్‌, హన్మంత్‌రెడ్డి పాల్గొన్నారు.  

Updated Date - 2022-05-24T05:46:38+05:30 IST