స్విమ్స్‌ ఆస్పత్రితో పలు ఆరోగ్య బీమా కంపెనీల ఒప్పందం

ABN , First Publish Date - 2021-11-28T07:17:12+05:30 IST

అన్ని వర్గాల ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించే దిశగా స్విమ్స్‌ ముందుకు సాగుతోందని మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రామ్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

స్విమ్స్‌ ఆస్పత్రితో పలు ఆరోగ్య బీమా కంపెనీల ఒప్పందం

తిరుపతి సిటీ, నవంబరు 27: అన్ని వర్గాల ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించే దిశగా స్విమ్స్‌ ముందుకు సాగుతోందని మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రామ్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగానే ఇన్సూరెన్స్‌ నెట్‌వర్క్‌ ఆస్పత్రిగా స్విమ్స్‌ నమోదు చేసుకుందని చెప్పారు. ఇప్పటికే పలు హెల్త్‌ ఇన్సూరెన్స్‌ల కింద రోగులకు నగదు రహిత వైద్య సేవలను అందిస్తున్నామన్నారు. ఈ క్రమంలో మరో తొమ్మిది హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలు ఒప్పందం కుదుర్చుకున్నాయని తెలియజేశారు. ఇకపై ఇఫ్కో-టోకియో, ఫ్యూచర్‌ జనరలి, సేఫ్‌ వే, గుడ్‌ హెల్త్‌, బజాజ్‌ అలయన్స్‌, హెరిటేజ్‌, ఫ్యామిలీ హెల్త్‌ప్లాన్‌ ఇన్సూరెన్స్‌, రిలయన్స్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌, మెడి అసిస్ట్‌ ఇన్సూరెన్స్‌ల పరిధిలో ఆరోగ్య బీమా ఉన్న వారికి కూడా నగదు రహిత వైద్య సేవలను అందిస్తామన్నారు. మరికొన్ని కంపెనీలతోనూ ఒప్పందం కుదుర్చుకొని రోగులకు వైద్య సేవలను అందించే దిశగా స్విమ్స్‌ ముందుకు సాగుతోందని ఆయన వివరించారు.

Updated Date - 2021-11-28T07:17:12+05:30 IST