‘కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవసాయ బిల్లు’

ABN , First Publish Date - 2020-12-04T04:32:57+05:30 IST

కేంద్ర ప్రభుత్వం సంక్షేమ రాజ్యం పేరుతో కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవసాయ బిల్లును తీసుకువచ్చిందిని సీపీఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్‌ పేర్కొన్నారు.

‘కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవసాయ బిల్లు’

మైదుకూరు, డిసెంబరు 3 : కేంద్ర ప్రభుత్వం సంక్షేమ రాజ్యం పేరుతో కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవసాయ బిల్లును తీసుకువచ్చిందిని సీపీఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్‌ పేర్కొన్నారు. గురువారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ వ్యవసాయ బిల్లు వల్ల 86 శాతం రైతులు వారి భూముల్లోనే కూలీలుగా మారతారని, రైతు ఉద్యమాలను ప్రజా ఉద్యమాలుగా ప్రజలు స్వీకరించాలని తెలిపారు. ఆహార ధాన్యాలను నిల్వ చేసే చట్టాన్ని ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా నిర్వీర్యం చేసేందుకే బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. కార్యక్రమంలో షరీఫ్‌, సుబ్బరాయుడు, మగ్దుం, రాయప్ప, రవి తదితరులు పాల్గొన్నారు. 


ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో...

రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడే ప్రభుత్వాలు మళ్లీ అధికారంలోకి వచ్చిన దాఖలాలు లేవని ఏపీ  జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు ఏవి రమణ తెలిపారు. మైదుకూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఢిల్లీలో వారం రోజులుగా జరుగుతున్న రైతు ఆందోళనలే ప్రభుత్వ పతనానికి నాంది అని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు మురళీ, ఓబులేసు, రామ్మోహన్‌, సుబ్బరాయుడు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-04T04:32:57+05:30 IST