పత్తిసాగు లాభదాయకం

ABN , First Publish Date - 2022-07-07T04:41:53+05:30 IST

అధిక సాంద్రతలో పత్తి సాగు ఎంతో లాభదాయకం అని జిల్లా వ్యవసాయాధికారి కొర్సా అభిమన్యుడు అన్నారు.

పత్తిసాగు లాభదాయకం
మాట్లాడుతున్న అభిమన్యుడు

జిల్లా వ్యవసాయాధికారి అభిమన్యుడు

సుజాతనగర్‌, జూలై 6: అధిక సాంద్రతలో పత్తి సాగు ఎంతో లాభదాయకం అని జిల్లా వ్యవసాయాధికారి కొర్సా అభిమన్యుడు అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని రైతు వేదిక ప్రాంగణంలో నియోజక వర్గ స్థాయి డీలర్లకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. డీలర్లకు శిక్షణ ఇవ్వడం ద్వారా రైతులు మరింత అభివృధ్ది చెందవచ్చన్న భావనతో ఈ శిక్షణను ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ శిక్షణలో భాగంగా అధిక సాం ద్రతలో పత్తి సాగు విధానం, నీళ్లల్లో పీఎస్‌బి విధానం, అలాగే మన జిల్లాలో ప్రధాన పంటలైన ప్రత్తి, వరి వం టి పంటలపై అధిక దిగుబడలు సాధించేలా రైతులను ఏవిధంగా ప్రోత్సహించాలో సవివరంగా వివరించారు.  జిల్లా సుమారు 500 మంది డీలర్లు ఉన్నారని ఇప్పటి వరకు సుమారు రెండు దఫాలుగా 280 మందికి శిక్షణను ఇవ్వడం జరిగిందని జిల్లా డీలర్ల అసోసియేషన్‌ అధ్యక్ష, ఉపాధ్యక్షులు సోమసుందర్‌, వంకాయలపాటి రామలింగయ్య తెలిపారు. 


Updated Date - 2022-07-07T04:41:53+05:30 IST